అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.