Adani Group: గౌతమ్ అదానీ, సమీప బంధువు సాగర్‌కి సమన్లు
- అదానీ, సమీప బంధువు సాగర్‌కి యూఎస్ సమన్లు
- 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
- అదానీ ఇచ్చిన అభియోగాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరిపై అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా.. ఈ దర్యాప్తులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఎన్ఫోర్స్మెంట్ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ సంజయ్ వాధ్వా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అదానీ ఇచ్చిన అభియోగాలు?
గౌతమ్ అదానీ (Gautam Adani), సాగర్ అదానీ ఒక ఆఫర్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రీన్ బాండ్లను కొనుగోలు చేయడానికి యుఎస్ (usa)పెట్టుబడిదారులను ప్రేరేపించారు. అదానీ గ్రీన్ ప్రాజెక్ట్ భారత్ లో విజయవంతం అవుతుందని, అందుకు వీలుగా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు పెద్ద ఎత్తున లంచాలను ఇచ్చామని వారు యుఎస్ పెట్టుబడిదారులకు చెప్పారు. ఇది అమెరికాలో సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘన అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ స్పష్టం చేసింది.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
స్పందించిన సంజయ్ వాధ్వా
సౌర విద్యుత్ ఒప్పందాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించడానికిి భారత ప్రభుత్వ ఉన్నతాధికారులకు సుమారు రూ.2,100 కోట్ల మేర లంచం ఇచ్చినట్టు అదానీ ప్రతినిధులపై హైప్రొఫైల్ లంచం ఆరోపణలు కేంద్రీకృతమయ్యాయి. వైట్ హౌజ్ స్పందించేవరకు వెళ్లిన ఈ అభియోగాలపై దర్యాప్తును సంజయ్ వాధ్వా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సెక్యూరిటీల ఉల్లంఘనలకు కార్పొరేట్ లీడర్లను బాధ్యులను చేయడంలో వాధ్వాది అందెవేసిన చేయి. సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సీనియర్ కార్పొరేట్ అధికారులు, డైరెక్టర్లతో సహా ఇందులో పాత్ర ఉన్న అందరినీ కమిషన్ విచారిస్తుందని ఇటీవల ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!