US LPG Supplier to India: భారత్‌కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
- కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం
- భారత్ తన ఇంధన సరఫరా వ్యూహాన్ని వేగంగా మార్చుకుంది
- అమెరికా ఇప్పుడు భారత్‌కు అత్యధిక LPG సరఫరా చేస్తున్న దేశంగా అవతరించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US LPG Supplier to India: మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం, కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో భారత్ తన ఇంధన సరఫరా వ్యూహాన్ని వేగంగా మార్చుకుంది. ఇందులో భాగంగా అమెరికా ఇప్పుడు భారత్‌కు అత్యధిక LPG సరఫరా చేస్తున్న దేశంగా అవతరించింది. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న LPGలో దాదాపు 67 శాతం అమెరికా నుంచే వస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి LPG దిగుమతులు తగ్గినప్పటికీ, ప్రత్యామ్నాయ వనరులను వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశంలో ఇంధన కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
అమెరికా నుంచి 67 శాతం LPG దిగుమతులు
“ప్రస్తుతం మా LPG దిగుమతుల్లో దాదాపు 67 శాతం అమెరికా వాటా ఉంది” అని హర్దీప్ సింగ్ పురి తెలిపారు. హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడిన సమయంలో భారత్ ఒక్క ప్రాంతంలో కూడా ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిందని వివరించారు. దేశీయ LPG ఉత్పత్తిని కూడా పెంచినట్లు మంత్రి తెలిపారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు దేశీయ ఉత్పత్తి పెంపు ద్వారా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
ఒక్క ఇంధన స్టేషన్ కూడా ఎండిపోలేదు
మధ్యప్రాచ్య సంక్షోభం సమయంలో సరఫరా అంతరాయాలు ఎదురైనప్పటికీ దేశంలో ఎక్కడా ఇంధన కొరత రాలేదని పూరి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1.07 లక్షలకు పైగా ఫ్యూయల్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, వాటిలో ఒక్క స్టేషన్ కూడా ఇంధనం లేకుండా నిలిచిపోలేదని ఆయన అన్నారు. 2014లో దేశంలో ఇలాంటి ఫ్యూయల్ రిటైల్ అవుట్లెట్లు సుమారు 52,000 మాత్రమే ఉండేవని, గత కొన్నేళ్లలో ఈ నెట్వర్క్ గణనీయంగా విస్తరించిందని తెలిపారు.
27 దేశాల నుంచి 41 దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరా
భారత్ తన క్రూడ్ ఆయిల్ దిగుమతుల వనరులను కూడా విస్తరించింది. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్.. ప్రస్తుతం 41 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్‌ను సమీకరిస్తోందని మంత్రి వెల్లడించారు. ఇలా సరఫరా వనరులను విస్తరించడం వల్ల ఒకే ప్రాంతం లేదా దేశంపై అధికంగా ఆధారపడే పరిస్థితి తగ్గిందని చెప్పారు. అలాగే దేశంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా విస్తరించింది. గతంలో 55 భౌగోళిక ప్రాంతాలకు పరిమితమైన ఈ కవరేజీ ప్రస్తుతం 309 భౌగోళిక ప్రాంతాలకు చేరిందని తెలిపారు.
హార్ముజ్ జలసంధి ఎందుకు కీలకం?
మధ్యప్రాచ్యం నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరాలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కీలకమైన సముద్ర మార్గంగా ఉంది. మధ్యప్రాచ్యంలో సంక్షోభం ప్రారంభం కావడానికి ముందు భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో దాదాపు సగం వరకు హార్ముజ్ జలసంధిని రవాణా మార్గంగా ఉపయోగించే దేశాల నుంచి వచ్చేది. అలాగే భారత్‌కు అవసరమైన LPGలో కనీసం 90 శాతం, ఇతర గ్యాస్ దిగుమతుల్లో సుమారు 60 శాతం ఈ జలమార్గం ద్వారా వచ్చేవని పురి తెలిపారు. అయితే ఈ మార్గంలో అంతరాయాలు ఏర్పడిన తర్వాత భారత్ వెంటనే దిగుమతి వనరులను మార్చడం ప్రారంభించింది.
భారత్ వద్ద 60 రోజుల ఇంధన నిల్వ
భారత్ ఎప్పుడూ క్రూడ్ ఆయిల్ సరఫరాలో కొరతను ఎదుర్కోలేదని పూరి తెలిపారు. దేశం వద్ద సుమారు 60 రోజుల ఇంధన నిల్వ అందుబాటులో ఉందని చెప్పారు. ఇంధన భద్రత విషయంలో భారత్ ఆలోచనా విధానం కూడా మారిందని మంత్రి పేర్కొన్నారు. గతంలో హైడ్రోకార్బన్లను పొందడంపైనే ప్రధానంగా దృష్టి ఉండేదని, ఇప్పుడు విభిన్న దిగుమతి వనరులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రత్యామ్నాయ ఇంధనాలు, దేశీయ ఉత్పత్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
రూ.84,000 కోట్ల ‘సముద్ర మంథన్’ కార్యక్రమం
ఇంధన సరఫరా భద్రతతో పాటు దేశీయంగా చమురు, సహజ వాయువు అన్వేషణను పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ఆమోదించింది. రూ.84,000 కోట్ల ‘సముద్ర మంథన్’ కార్యక్రమం ద్వారా సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో చమురు, గ్యాస్ అన్వేషణకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో డ్రిల్లింగ్‌ను ప్రభుత్వం స్వయంగా నిర్వహించదని, ప్రైవేట్ సంస్థలే డ్రిల్లింగ్ కార్యకలాపాలను చేపడతాయని పురి తెలిపారు. అధిక రిస్క్ ఉన్న సముద్రపు లోతట్టు ప్రాంతాల్లో అన్వేషణకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డ్రిల్లింగ్ ఖర్చులో 50 శాతం వరకు లేదా ఒక్క బావికి గరిష్ఠంగా రూ.650 కోట్ల వరకు మద్దతు అందించనుందని ఆయన వివరించారు.
ఇంధన భద్రతలో భారత్‌కు కొత్త దిశ
హార్ముజ్ సంక్షోభం భారత్‌కు ఇంధన దిగుమతుల విషయంలో వైవిధ్యీకరణ ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది. అమెరికా నుంచి LPG దిగుమతులను పెంచడం, దేశీయ LPG ఉత్పత్తిని పెంచడం, క్రూడ్ ఆయిల్ సరఫరా దేశాలను 27 నుంచి 41కు విస్తరించడం వంటి చర్యలు భవిష్యత్తులో అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక లోతైన సముద్ర ప్రాంతాల్లో దేశీయ చమురు, గ్యాస్ అన్వేషణకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలంలో భారత్ తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
US LPG Supplier to India: భారత్‌కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!