UPI Charges: UPI-రూపే చెల్లింపులు ఇకపై ఉచితం కాకపోవచ్చు.. ట్రాన్సాక్షన్స్ పై కొత్త ఛార్జీలు!
- UPI-రూపే చెల్లింపులు ఇకపై ఉచితం కాకపోవచ్చు
- డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వ్యాపారులపై ఛార్జీలు విధించడానికి చర్చలు
- వ్యాపారులు UPI, RuPay లావాదేవీలకు కూడా ఛార్జ్ చేసేలా చర్యలు
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేశాయి. దాదాపు లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. అయితే వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) మరియు రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వ్యాపారులపై ఛార్జీలు విధించడానికి చర్చలు జరుగుతున్నాయని ఇద్దరు సీనియర్ బ్యాంకింగ్ అధికారులు తెలిపారు.
Also Read:IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
Also Read
- Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!
- Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
- Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
- EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
ప్రస్తుతం UPI, RuPay డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ MDR నుంచి మినహాయించబడ్డాయి. అయితే రూ. 40 లక్షల కంటే ఎక్కువ వార్షిక GST టర్నోవర్ ఉన్న వ్యాపారులకు MDR వర్తింపజేయాలని సూచిస్తూ బ్యాంకులు ఒక ప్రతిపాదనను తీసుకొచ్చాయి.పెద్ద వ్యాపారులు ఇప్పటికే వీసా, మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులు, వివిధ క్రెడిట్ కార్డులపై MDR చెల్లిస్తున్నారని బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాపారులు UPI, RuPay లావాదేవీలకు కూడా ఛార్జ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
Also Read:Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది
2022 కి ముందు బ్యాంకులు డిజిటల్ లావాదేవీలపై వ్యాపారుల నుంచి 1 శాతం కంటే తక్కువ MDR వసూలు చేసేవి. అయితే, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం FY22 బడ్జెట్లో ఈ ఛార్జీలను తొలగించింది. MDR పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వ్యాపారులు, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు వినియోగదారులపై కూడా ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. కాగా ఫిబ్రవరి 2025లో UPI 1,611 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. దీని విలువ రూ.21.96 లక్షల కోట్లు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?