వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? ఇటీవలే 2 లక్షల మార్కు దాటి రికార్డ్ సృష్టించిన వెండి.. ఇప్పుడు 3 లక్షల మార్కుకు పరుగులు పెడుతోంది. ఈరోజు ఒక్కరోజే ఏకంగా రూ.10,000 పెరిగి మరో రికార్డ్ సృష్టించింది. ఇంకోవైపు బంగారం కూడా అదే రీతిగా పరుగులు పెడుతోంది. నిన్న భారీగా పెరిగిన పసిడి ధర.. ఈరోజు కూడా మరోసారి పెరిగింది. గోల్డ్ ధర కూడా కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేయబోతుంది. దీంతో బంగారం, వెండి కొనాలంటేనే కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: H-1B Lottery: H-1B వీసా దరఖాస్తుదారులపై మరో పిడుగు.. లాటరీ విధానం రద్దు
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.380 పెరిగి.. రూ.1,38,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 350 పెరిగి రూ.1,27,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.290 పెరిగి రూ.1,04,200 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Epstein Files: మరో ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల.. ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు!
ఇక సిల్వర్ ధర బిగ్ షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో సరికొత్త రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.2,33, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,44,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,33, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.