Safe IT Jobs: గతంలో కేవలం పారిశ్రామిక పరిశ్రమల్లోనే లాకౌట్‌లు, లే ఆఫ్‌లు ఉండేవి. ఇప్పుడు మారిన ప్రపంచంలో చాలా రంగాల్లోకి లే ఆఫ్‌లు వచ్చేశాయి. ప్రధానంగా సాంకేతిక పెరిగిపోవడంతో.. ఉద్యోగుల సంఖ్య కూడా అందుకనుగుణంగా పెరగుతూ వస్తోంది. ఉద్యోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఐటీ కంపెనీలు కూడా లేఆఫ్‌లను ప్రకటించడం ప్రారంభించాయి. ఎక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో వారిని తగ్గించుకోవడం కోసం లే ఆఫ్‌లను ఐటీ కంపెనీలు, సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇది భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో జరుగుతోంది. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం కోల్పోతే ఆ కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. దానికి కారణంగా వారి వేతనం ఎక్కువగా ఉండటమే. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), చాట్ జీపీజీతో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి.. అదే స్థాయిలో ఉద్యోగుల తొలగింపు కూడా ఉంటుంది. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో కూడా కొన్ని ఉద్యోగాలకు ఎటువంటి ఢోకా లేదని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా టెక్ రంగానికి 2022 సంవత్సరం చాలా కఠినమైనదిగా నిలిచింది. లక్షలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం కూడా ఐటీ రంగంలో లేఆఫ్‌ల పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం 2023లో ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఆర్థిక మందగమనంతో పాటు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విజృంభణతో సాఫ్ట్ వేర్ పరిశ్రమలో పనిచేస్తున్న వారి కష్టాలను మరింతగా పెంచింది.
Read also: Guntur Kaaram: బిగ్ బ్రేకింగ్.. మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ఐటీలో డిమాండ్‌తోపాటు భద్రత ఉన్న ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఐటీ మేనేజర్‌లు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌లు, వెబ్ డెవలపర్‌లు, డేటా అడ్మినిస్ట్రేటర్ వంటి జాబ్‌లు 2023లో సాంకేతిక రంగంలో అత్యధిక ఉద్యోగ భద్రతను అందించగలవని బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ ప్రకించింది. ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. బిజినెస్ పబ్లికేషన్ మింట్ నివేదిక ప్రకారం.. లీగల్, స్ట్రాటజీ సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు లేఆఫ్‌ల వల్ల ప్రభావితం కాలేదని తేలింది. ఐటీలో కెరీర్‌ని ప్లాన్ చేసుకునేవారు వీటిని నమ్మకమైన ఉద్యోగ ఎంపికలుగా పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పరిశ్రమలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లేఆఫ్‌ల ప్రమాదం ఎక్కువగా ఉన్న జాబ్‌లు కూడా కొన్ని ఉన్నాయి. కస్టమర్ స్పెషలిస్ట్‌లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, బేసిక్ కోడర్‌లు, డేటా సైంటిస్టులు, రిక్రూటర్‌లకు డిమాండ్ వేగంగా పడిపోతున్నట్లు ఇటీవలి కొన్ని నివేదికలు, మార్కెట్ ట్రెండ్‌లు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి కొత్తగా సాఫ్ట్ వేర్ రంగంలోకి రావాలనుకునే వారు ఒకసారి ఆలోచించుకొని ఉద్యోగాలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.