Guntur Kaaram: బిగ్ బ్రేకింగ్.. మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా హిట్స్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే గత కొన్నిరోజులుగా ఈ సినిమాపై అనేక రూమర్స్ వినిపిస్తున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ ఆగిపోవడం, హీరోయిన్ మారిపోవడం, మహేష్ వెకేషన్ కు వెళ్లడం.. ఇలా జరుగుతున్న నేపథ్యంలో అస్సలు సినిమా పూర్తవుతుందా.. ? లేదా.. ? అనే డౌట్ అభిమానుల్లో కలిగింది. అదంతా క్లియర్ అవ్వాలంటే విదేశాల్లో ఉన్న మహేష్ ఇండియాకు రావాలి.. షూటింగ్ మొదలుపెట్టాలి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రేపు మహేష్ బాబు బర్త్ డే. దీంతో ఈ సినిమా నుంచిఏదైనా అప్డేట్ వస్తుందా.. ? అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల నుంచి అస్సలు ఏ అప్డేట్ లేదు అని, పాట కాదు కదా పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడం కష్టమని చెప్పుకొస్తున్నారు. అయితే అవన్నీ నిజం కాదని మేకర్స్ తేల్చి చెప్పేశారు.
Mrunal Thakur: మేకప్ లేకుండా సీతను గుర్తుపట్టడం కష్టమే.. సుమీ
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
రేపు మహేష్ బర్త్ డే ట్రీట్ కు రెడీ గా ఉండండి అంటూ హింట్ ఇచ్చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ” రేపు.. సూపర్ స్టార్ సూపర్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేయడానికి మాతో చేరండి” అంటూ చెప్పుకొచ్చారు. ఈ రాత్రికే అప్డేట్ వస్తుంది అని తెలియడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ముఖాలు వెలిగిపోతున్నాయి. అయితే ఆ అప్డేట్ ఏంటి.. ? పోస్టర్.. ? సాంగ్ ప్రోమో.. ? స్పెషల్ గ్లింప్స్.. ? ఏది వస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది అయితే ఏముంది.. ఫ్యాన్స్ ను వెయిట్ చేయించినా ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు.. అది చాలు అంటున్నారు అభిమానులు.. మరి ఆ అప్డేట్ ఏంటి అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!