Union Budget 2025-26: బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు.. కారణం ఇదే..
- స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌లో పెరుగుదల
- నెస్లేలో 4.25 శాతం వృద్ధి
- మార్కెట్లో ఆశలు చిగురించడానికి కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740.76 పాయింట్ల వద్ద ప్రారంభమై 77,500.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 258.90 పాయింట్లు పెరిగి 23,508.40కి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌లో పెరుగుదల కనిపించింది. 30 సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలలో లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి), నెస్లే నాలుగు శాతానికి పైగా లాభాన్ని నమోదు చేశాయి. ఎల్ అండ్ టీలో 4.31 శాతం, నెస్లేలో 4.25 శాతం వృద్ధి నమోదైంది. ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ షేర్లు కూడా అత్యధికంగా లాభపడ్డాయి. ఐటీసీ హోటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.
READ MORE: NTPC Jobs: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? నెలకు రూ. లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ రెడీ
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సమీక్ష ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3-6.8 శాతంగా ఉంటుందని అంచనా. దీంతోపాటు శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సామాన్యులకు ఊరట లభించే అవకాశాలున్నాయి. ఆదాయపు పన్ను తగ్గించ వచ్చని అభిప్రాయం వ్యక్త మవుతోంది. ఇదే జరిగితే ఖర్చులు తగ్గుతాయి. ఈ ఆశతో మార్కెట్ బుల్లిష్ బ్యాండ్‌వాగన్‌పైకి దూసుకెళ్లింది.
READ MORE: Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..
దీంతో పాటు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. మధ్యతరగతి గురించి చాలా విషయాలు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇటీవల ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు నిర్ణయాన్ని కూడా ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదలకు ఇది ప్రాతిపదికగా ఉంటుంది. మధ్యతరగతి ప్రజల ‘సొంత ఇంటి కల’ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సామాన్యులపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని మార్కెట్లో ఆశలు చిగురించాయి.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!