Telangana Company: తెలంగాణ కంపెనీకి ‘మహా’ ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Company: హైదరాబాద్‌లోని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కి మహారాష్ట్ర నుంచి 185 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ వచ్చింది. 123 బస్సుల మ్యానిఫ్యాక్షరింగ్, మెయింటనెన్స్ బాధ్యతలను థానే మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ అప్పగించింది. ఈ బస్సులను 9 నెలల్లో తయారుచేసి అందించాలని, 15 ఏళ్లపాటు నిర్వహణ చూసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. లిథియం అయాన్లతో రూపొందించే ఈ బస్సుల బ్యాటరీలను నాలుగు గంటల్లోనే రీఛార్జ్ చేయొచ్చు. 55 బస్సులను 12 మీటర్ల పొడవున, 68 బస్సులను 9 మీటర్ల పొడవున తయారుచేయనున్నారు.
కిమ్స్‌లోని షేర్ల అమ్మకం
Also Read
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని 12 లక్షలకు పైగా షేర్లను జనరల్ అట్లాంటిక్ సింగపూర్ విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షేర్లను 151 కోట్ల 25 లక్షల రూపాయలకు ఓపెన్ మార్కెట్లో అమ్మినట్లు తెలుస్తోంది. ఒక్కో షేర్ యావరేజ్‌గా 12 వందల 50 రూపాయలు పలికినట్లు బీఎస్ఈ బల్క్ డీల్స్‌ని బట్టి అర్థమవుతోంది. ఈ నెలారంభంలో కూడా ఈ సంస్థ పదహారున్నర లక్షలకు పైగా షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికం ముగిసేనాటికి కిమ్స్‌లో జనరల్ అట్లాంటిక్‌కి 17 పాయింట్ రెండు నాలుగు శాతం వాటా ఉంది.
RBI Orders: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
‘రూపాయి-రియాల్స్’లో చెల్లింపులు
ఇండియా కరెన్సీ రూపాయి, సౌదీ అరేబియా కరెన్సీ రియాల్స్‌లో వాణిజ్య చెల్లింపులు చేసేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు కోసం ఈ రెండు దేశాలు లేటెస్టుగా చర్చలు జరిపాయి. దీంతోపాటు ఆ గల్ఫ్ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సిస్టమ్‌ను మరియు రూపే కార్డును ప్రవేశపెట్టే విషయం కూడా ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ నెల 18 మరియు 19 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన వివిధ అంశాలపై సౌదీ అరేబియాతో చర్చలు జరిపారు. అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై రూపాయల్లో చేయాలని ఆర్బీఐ ఈమధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?