Site icon NTV Telugu

Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌కు అన్ని పండుగలు ఒకేసారి వచ్చేసినట్లున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా నూతనోత్సాహం వచ్చింది. సోమవారం భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పెట్టుబడిదారుల్లో కొత్త సంతోషాన్ని తీసుకుంది. భారత్‌పై అమెరికా భారీగా సుంకాన్ని తగ్గించింది. 50 నుంచి 18 శాతానికి సుంకాన్ని తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లకు అన్ని ఫెస్టివల్స్ ఒకేసారి వచ్చేశాయి.

మంగళవారం మార్కెట్ ప్రారంభం నుంచే అత్యున్నత స్థాయిలో సూచీలు లాభాల్లో దూసుకుపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3,656 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా… నిఫ్టీ 1,219 పాయింట్ల లాభంతో 26, 308 దగ్గర కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో దూసుకుపోతున్నాయి. గత కొద్దిరోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్… అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడంతో పండుగ వాతావరణాన్ని తీసుచ్చింది.

Exit mobile version