Site icon NTV Telugu

Stock Market: మార్కెట్‌పై ట్రంప్ ఆశలు గల్లంతు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

Trump

Trump

దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే మార్కెట్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయని ఆర్థిక నిపుణులు అంతా భావించారు. కానీ ట్రంప్ ప్రభావం ఏ మాత్రం చూపించకపోగా.. భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1, 235 పాయింట్లు నష్టపోయి 75, 838 దగ్గర ముగియగా.. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23, 024 పాయింట్లు దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Donald Trump: “బర్త్ రైట్ పౌరసత్వం” రద్దు.. ఇండియన్స్‌కి ట్రంప్ బిగ్ షాక్.. ప్రభావం ఎంత..?

నిఫ్టీలో ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం అత్యధికంగా నష్టపోగా.. అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం నష్టపోయాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు రియాలిటీ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం క్షీణించగా, బ్యాంక్, విద్యుత్, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ ఒక్కొక్కటి 2 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Adi Srinivas: నీ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదు.. కేటీఆర్ పై ఫైర్

Exit mobile version