దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో నిఫ్టీలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన నష్టాలను చవిచూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాలకు బ్రేక్ పడింది. భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లో కొనసాగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే మార్కెట్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయని ఆర్థిక నిపుణులు అంతా భావించారు.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వరుస నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అయితే సంక్రాంతి వేళ మార్కెట్‌కు కొత్త జోష్ వచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో సంక్రాంతి రోజున లాభాల బాట పట్టిన సూచీలు.. రెండో రోజుగా కూడా అదే ఊపు కనిపించింది. కనుమ రోజున కూడా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి దాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి.
న్యూఇయర్ ఆరంభంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో కొత్త జోష్ కనిపించింది. రెండు రోజుల పాటు సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్ల ఉత్సాహతతో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం వరుస నష్టాలను చవిచూసింది. గత వారం సూచీలు రికార్డులు సృష్టిస్తే.. ఈ వారం అందుకు భిన్నంగా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.