మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి. తాజాగా స్టాక్ మార్కెట్ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20న సెలవు ప్రకటించింది. గురునానక్ జయంతి సందర్భంగా వచ్చే శుక్రవారం (నవంబర్ 15న) కూడా స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. నవంబర్ 1న (దీపావళి) మూసివేత తర్వాత నవంబర్‌లో మార్కెట్లకు ఇది మూడవ సెలవుదినం అవుతుంది. జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్‌లకు సెలవు ప్రకటించారు. అనంతరం మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది మే 20న కూడా మార్కెట్ క్లోజ్ అయింది. అటు తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 20న మరోసారి మూసివేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Appudo Ippudo Eppudo Review: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
మహారాష్ట్రలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 20న ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది. అన్ని వర్గాల వారు ఓటు వేసేలా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రాముఖ్యంగా పట్టణాల్లో ఉద్యోగులు, విద్యావంతులు ఓటు వేసేందుకు నిరాకరిస్తుంటారు. సెలవు ఇచ్చినా ఓటేసేందుకు కదలరు. ఇలాంటి వారి కోసం ఈసీ ఆయా విధాలుగా ప్రచారం చేస్తోంది. పలు ప్రైవేటు కంపెనీలు అయితే ఇప్పటికే వేతనంతో కూడిన సెలవును ప్రకటించేశాయి. ఇక నవంబర్ 20న మహారాష్ట్రలో పోలింగ్ జరుగుతుండగా.. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..