Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పతనమైన రిలయన్స్ షేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. జులై నెలకు మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికి.. రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపించాయి. రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నప్పటికీ.. పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి.చమురు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో ఈ సంస్థలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయి 52,907కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.03 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలు మూటకట్టుకున్నాయి.
Also Read
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఐటీసీ (3.97%), బజాన్ ఫైనాన్స్ (3.96%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.57%), సిప్లా(3.50%), బ్రిటానియా (3.40%), ఏసియన్ పెయింట్స్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.34%).
టాప్ లూజర్స్
ఓఎన్జీసీ(-13.53%), రిలయన్స్ (-7.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.53%), బజాజ్ ఆటో(-2.21%), ఎన్టీపీసీ (-1.82%), భారతి ఎయిర్ టెల్ (-1.54%), మారుతి (-0.87%).
- Tags
- BSE
- business news
- IT
- Nifty
- Reliance
తాజావార్తలు
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!