కేంద్ర బడ్జెట్ ముందు దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయింది. భారత్-ఈయూ డీల్ తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా సాగుతోంది. కనీసం కేంద్ర వార్షిక బడ్జెట్ సమయంలోనైనా బలపడుతుందని భావిస్తే.. తీరా చూస్తే ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది.
ఇది కూడా చదవండి: US: భారత్-ఈయూ డీల్ నిరాశ పరిచింది.. మరోసారి అమెరికా కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం సెన్సెక్స్ 498 పాయింట్లు నష్టపోయి 81, 842 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయి 25, 197 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొని క్షీణించింది. ఓ వైపు భారత్-ఈయూ డీల్.. ఇంకోవైపు నిరలమ్మ బడ్జెట్.. అయినా కూడా ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇక రూపాయి విలువ కూడా కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92 మార్కును దాటింది. విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు చేయడంతో రూపాయిలో క్షీణత ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Colombia Plane Crash: కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది మృతి
మారుతి సుజుకి, ఆసియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎం అండ్ ఎం నిఫ్టీలో ప్రధాన నష్టాలను చవిచూశాయి, ఎల్ అండ్ టి, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఒఎన్జీసీ లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.