Site icon NTV Telugu

Stock Market: ట్రంప్ ఫార్మా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో నిఫ్టీలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన నష్టాలను చవిచూశాయి. ఐటీ, ఫార్మా 1-2 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, బీఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం తగ్గాయి.ఎల్ అండ్ టి, హీరో మోటోకార్ప్, హిందాల్కో, టాటా స్టీల్, ఒఎన్‌జీసీ మాత్రం లాభపడ్డాయి.

ఇది కూడా చదవండి: Trump: పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ రహస్య చర్చలు

ప్రస్తుతం సెన్సెక్ 405 పాయింట్లు నష్టపోయి 80, 754 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 115 పాయింట్లు నష్టపోయి 24, 775 దగ్గర ట్రేడ్ అవుతోంది. రూపాయి మారకం విలువ ఐదు పైసలు బలహీనపడింది.

ఇది కూడా చదవండి: Trump: సుంకాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. భారత్‌కు భారీ ఎఫెక్ట్

ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1, 2025 నుంచి 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఫార్మా దిగుమతులపై ఎక్కువగా అమెరికాతో భారతదేశమే వాణిజ్యం చేస్తోంది. దీంతో ఎక్కువగా భారత్‌పైనే ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే 50 శాతం సుంకం విధించగా.. తాజాగా ఫార్మాపై భారీగా సుంకం విధించడంతో భారత్‌పై మరింత ఎటాక్ చేసినట్లైంది.

Exit mobile version