Gold Income: ఒక్క గ్రాము బంగారంపై రూ.11,221 లాభం.. ఆర్బీఐ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నా, రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, సంపాదన ఎంత అన్నది కాదు, అందులో ఎంత పొదుపు చేశామన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ పసిడి బాండ్ల (SGB) ఉదాహరణే తీసుకుంటే.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన చిన్న పెట్టుబడి నేడు ఏకంగా నాలుగు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సరైన సమయంలో.. సరైన చోట డబ్బును పొదుపు చేస్తే అది కాలక్రమేణా వటవృక్షమై మనకు ఆర్థిక స్వేచ్ఛను, భద్రతను ఇస్తుంది. పొదుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు.. అది మన సంపదను సృష్టించే ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన సార్వభౌమ పసిడి బాండ్లు (Sovereign Gold Bonds – SGB) పెట్టుబడిదారులకు కనకవర్షాన్ని కురిపిస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన 5వ సిరీస్ బాండ్ల గడువు ముగియడంతో.. వాటిని వెనక్కి తీసుకునే (Redemption) ధరను ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. ఈ బాండ్ల తుది విక్రయ ధరను గ్రాముకు రూ. 15,009గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల క్రితం (అక్టోబర్ 2019లో) ఈ బాండ్లను జారీ చేసినప్పుడు గ్రాము ధర కేవలం రూ. 3,788 మాత్రమే. అంటే ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులకు ఒక గ్రాముపై ఏకంగా రూ. 11,221 లాభం వచ్చింది. ఇది దాదాపు 300 శాతానికి పైగా లేదా సుమారు 4 రెట్ల రాబడి.
Also Read
- Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్‌డేట్స్ పొందండిలా..
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
రిడంప్షన్ ధరను ఎలా లెక్కిస్తారు?
ఈ ధరను నిర్ణయించడానికి ఆర్‌బీఐ ఒక పద్ధతిని అనుసరిస్తుంది. బాండ్ గడువు ముగిసే తేదీకి ముందు ఉన్న చివరి మూడు పని దినాలలో (Working Days) మార్కెట్లో ఉన్న బంగారం సగటు ధరను (IBJA రేట్ల ప్రకారం) పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన ఏప్రిల్ 2026 నాటి ధరలను బట్టి ఈ భారీ రేటు ఖరారైంది.
అదనపు ప్రయోజనాలు..
కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చే లాభమే కాకుండాజజ ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులు మరిన్ని ప్రయోజనాలు పొందారు. వాటిలో ముఖ్యంగా వార్షిక వడ్డీ. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంపై ప్రతి ఏటా 2.5 శాతం వడ్డీ లభించింది. ఇది నేరుగా పెట్టుబడిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. గడువు ముగిసే వరకు బాండ్లను ఉంచుకుంటే.. వాటిపై వచ్చే లాభాల (Capital Gains) మీద ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
భౌతిక బంగారంతో పోలిస్తే వీటిని భద్రపరిచే టెన్షన్ ఉండదు.. నాణ్యత విషయంలో ఎటువంటి మోసాలకు అవకాశం ఉండదు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో.. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించే ఎస్‌జీబీలు స్టాక్ మార్కెట్ కంటే మెరుగైన రాబడులను అందించాయి. ఎనిమిదేళ్ల క్రితం ఓపికగా పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆర్‌బీఐ నిర్ణయించిన ఈ ధర ఒక గొప్ప బహుమతి అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!