చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నా, రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, సంపాదన ఎంత అన్నది కాదు, అందులో ఎంత పొదుపు చేశామన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ పసిడి బాండ్ల (SGB) ఉదాహరణే తీసుకుంటే.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన చిన్న పెట్టుబడి నేడు ఏకంగా నాలుగు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సరైన సమయంలో.. సరైన చోట డబ్బును పొదుపు చేస్తే అది కాలక్రమేణా వటవృక్షమై మనకు ఆర్థిక స్వేచ్ఛను, భద్రతను ఇస్తుంది.…