ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉన్నది. ప్రజలకు నమ్మకమైన బ్యాంక్ గా స్థిరపడిపోయింది. కస్టమర్ల కోసం రక రకాల స్కీమ్స్, ఆఫర్లను అందిస్తూ ఆదరణ పొందుతోంది. భద్రత విషయంలో కూడా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నది. ఎస్బీఐ దాదాపు బ్యాంకు సేవలన్నింటిని డిజిటల్ రూపంలో అందిస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసింది. అయితే ఇప్పుడు యోనో యాప్ వినియోగంపై ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు ఎస్బీఐ కస్టమర్లు అయితే ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
అయితే ఈ అలర్ట్ ఎస్బీఐ కస్టమర్లు అందరికీ కాదు. ఆ ఫోన్లు యూజ్ చేసే వారికి మాత్రమే. ఆ ఫోన్లు యూజ్ చేస్తున్న వారు వెంటనే ఈ పని చేయాల్సిందే. అలా చేయకపోతే యోనో సేవలను పొందలేరు. సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎస్బీఐ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ఆండ్రాయిడ్ 11, అంత కంటే తక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో త్వరలోనే యోనో సేవలు నిలిపి వేయనున్నట్లు తెలిపింది. వెంటనే కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచించింది.
ఈ విషయాన్ని కస్టమర్లకు సందేశాల ద్వారా చేరవేస్తున్నది. ఆండ్రాయిడ్ 12 అంత కంటే ఎక్కువ వెర్షన్ మొబైల్స్‌కి అప్ గ్రేడ్ కావడానికి ఫిబ్రవరి 28 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. అంటే అప్పటి వరకు యోనో సేవలు పొందుతారు. లేదంటే పాత వర్షన్ మొబైల్స్ లో మార్చి 1, 2025 నుంచి యోనో సేవలు నిలిచిపోతాయని కస్టమర్లకు స్పష్టం చేసింది. మరి మీరు యోనో సేవలను అంతరాయం లేకుండా పొందాలంటే వెంటనే అప్ డేటెడ్ వర్షన్ స్మార్ట్ ఫోన్లను తీసుకోవాల్సి ఉంటుంది.