SBI: షాకింగ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఈఎంఐలు మరింత భారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది… బేస్ రేటును, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్‌ఆర్)ను 70 బేసిస్ పాయింట్లు పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది… ఎస్బీఐ తాజా నిర్ణయంతో బీపీఎల్ఆర్ రేటు అత్యధికంగా 13.45 శాతానికి చేరింది.. ఇక, బేస్ రేటు 8.7 శాతానికి పెరిగింది… దీంతో, బీపీఎల్‌ఆర్‌తో లింకైన రుణాల చెల్లింపులన్ని మరింత భారం కానున్నాయి… జూన్‌లో సమీక్షించిన సమయంలో బీపీఎల్ఆర్ రేటు 12.75 శాతంగా ఉండేది.. ఇప్పటి వరకు అదే అమల్లో ఉండగా… తాజా సవరణతో అది కాస్తా 13.45 శాతానికి చేరింది.. సమీక్షించిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది ఎస్బీఐ..
Read Also: SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం మరో మైలురాయి
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
మరోవైపు.. బేస్ రేటు 8.7 శాతానికి పెంచడంతో.. బేస్ రేటుపై రుణాలు తీసుకున్న వారందరికీ ఈఎంఐలు మరింత భారం కాబోతున్నాయి.. బేస్ రేటుతో రుణాలు తీసుకున్న రుణగ్రహీతలకు ఈఎంఐ మొత్తం పెరుగుతుంది. బ్యాంకులు రుణాలను పంపిణీ చేయడానికి ఉపయోగించే పాత బెంచ్‌మార్క్‌లు ఇవి. ఇప్పుడు చాలా బ్యాంకులు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్‌ఆర్) లేదా రెపో-లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్‌ఎల్ఎల్ఆర్)పై రుణాలు అందజేస్తున్నాయి. బ్యాంక్ బీపీఎల్‌ఆర్ మరియు బేస్ రేటు రెండింటినీ త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. ఎస్‌బీఐ రుణ రేట్ల సవరణ చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు కూడా దీనినే అనుసరించే అవకాశం ఉంది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశానికి ముందు బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ల పెరుగుదలతో.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.. షెడ్యూల్ ప్రకారం, తదుపరి ద్రవ్య విధాన సమావేశం సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..