SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
- ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్
- రూ.13,000 కోట్లు ఉండే అవకాశం
- వచ్చే నెలలో ఈ పబ్లిక్ ఇష్యూ మార్కెట్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (AMC) అయిన SBI మ్యూచువల్ ఫండ్ తన ప్రతిష్టాత్మక IPO (Initial Public Offering)ను ప్రారంభించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుంచి అనుమతి పొందింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ IPO పరిమాణం సుమారు రూ.13,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఈ పబ్లిక్ ఇష్యూ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా OFS ఆధారిత IPO
మార్చిలో దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం, ఈ IPO పూర్తిగా Offer For Sale (OFS) రూపంలో ఉంటుంది. మొత్తం 20.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఇందులో ఎలాంటి Fresh Issue ఉండదు.
Also Read
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
ఈ IPOలో భాగంగా SBI మ్యూచువల్ ఫండ్ ప్రమోటర్లైన State Bank of India (SBI), Amundi India Holding తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించనున్నాయి.
లిస్టింగ్ తర్వాత ప్రముఖ AMCల సరసన
IPO విజయవంతంగా పూర్తయిన తర్వాత SBI Funds Management Limited (SBIFML) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది. దీంతో ఇప్పటికే లిస్టెడ్‌గా ఉన్న:
ICICI Prudential AMC
HDFC AMC
UTI AMC
Aditya Birla Sun Life AMC
Nippon Life India AMC
Shriram AMC వంటి ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల సరసన చేరనుంది.
1987లో ప్రారంభమైన SBI మ్యూచువల్ ఫండ్
SBI మ్యూచువల్ ఫండ్ 1987లో స్థాపించారు. అనంతరం 1993లో SEBIలో నమోదు అయింది. 2011లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ Amundiతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం సంస్థ నిర్వహిస్తున్న పథకాలలో 52 ఈక్విటీ ఫండ్లు, 23 డెట్ ఫండ్లు, 13 హైబ్రిడ్ ఫండ్లు, 4 ఇతర పథకాలు ఉన్నాయి.
రూ.12.70 లక్షల కోట్ల AUM
SBI మ్యూచువల్ ఫండ్ ప్రస్తుతం రూ.12.70 లక్షల కోట్లకు పైగా Assets Under Management (AUM) ను నిర్వహిస్తోంది. AUM పరంగా ఇది దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ హౌస్‌గా కొనసాగుతోంది. ఇది పెట్టుబడిదారుల్లో సంస్థపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.
షేర్ హోల్డింగ్ వివరాలు
SBI Funds Management Limitedలో SBI వాటా 61.98%, Amundi వాటా 36.40% ఉన్నాయి.
పెట్టుబడిదారులకు ఎందుకు ముఖ్యమంటే?
SBI మ్యూచువల్ ఫండ్ IPO దేశీయ మూలధన మార్కెట్లలో 2026లో అత్యంత కీలకమైన పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా భావిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద AMC కావడం, భారీ AUM, బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ IPOపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, IPO ధర బ్యాండ్, ఓపెన్ డేట్, క్లోజింగ్ డేట్ వంటి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!