SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
- ఎస్బీఐలో సైబర్ ఘటన
- కస్టమర్ల డేటా లీక్‌పై దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI Cyber Attack: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ దాడి ఘటనను ధృవీకరించింది. ఈ ఘటనలో 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటా డార్క్ వెబ్‌లో బహిర్గతమైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బ్యాంకు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అవసరమని ఎస్బీఐ పేర్కొంది. డేటా ఎలా బయటకు వెళ్లింది? ఎంత మేరకు సమాచారం బహిర్గతమైంది? ఖాతాదారులకు, బ్యాంకుకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? అనే అంశాలను గుర్తించాల్సి ఉందని వెల్లడించింది.
ఏయే వివరాలు బహిర్గతమయ్యాయి?
ఎస్బీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం, డార్క్ వెబ్‌లో బయటపడిన డేటాలో ఖాతాదారులకు సంబంధించిన పలు వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు సమాచారం. వాటిలో:
Also Read
- Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
- Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
- Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
ఖాతాదారుల పేర్లు
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు
పుట్టిన తేదీలు
ఈమెయిల్ చిరునామాలు
నివాస చిరునామాలు
లింగానికి సంబంధించిన వివరాలు
బ్యాంకు బ్రాంచ్ గుర్తింపు వివరాలు
CIF ఐడెంటిఫికేషన్ నంబర్లు
లోన్, లీడ్ రికార్డులకు సంబంధించిన ఐడీలు, మెటాడేటా
ఇతర సంబంధిత ఫైళ్ల సమాచారం
ఈ వివరాలు బయటపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయని బ్యాంకు తెలిపింది. అయితే డేటా బహిర్గతానికి కారణం, దాని పూర్తి పరిధి, ఖాతాదారులపై పడే ప్రభావం ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అక్టోబర్ 16న హెచ్చరికలు.. అప్రమత్తమైన ఎస్బీఐ
2026 అక్టోబర్ 16న తన థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి ఎస్బీఐకి హెచ్చరికలు అందాయి. బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన సమాచారం డార్క్ వెబ్‌లో బహిర్గతమై ఉండవచ్చన్న అనుమానంపై ఈ హెచ్చరికలు వచ్చినట్లు బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. దీంతో బ్యాంకు వెంటనే సైబర్ ఘటనలకు స్పందించే చర్యలను ప్రారంభించింది. డేటా లీక్‌కు సంబంధించిన పరిస్థితిని నియంత్రించేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టింది.
సైబర్ భద్రతపై సమగ్ర దర్యాప్తు
ఈ ఘటన స్వరూపం, తీవ్రత, డేటా బహిర్గతమైన విధానాన్ని తెలుసుకునేందుకు CERT-In గుర్తింపు పొందిన స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థను ఎస్బీఐ నియమించింది. దర్యాప్తులో భాగంగా సమాచారం ఎక్కడి నుంచి బయటకు వెళ్లిందనే అంశంతో పాటు, ఎంతమంది ఖాతాదారుల వివరాలు ప్రభావితమయ్యాయి? డేటాను ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉందా? అనే అంశాలను పరిశీలించనున్నారు. దర్యాప్తు ఫలితాల ఆధారంగా అవసరమైన సరిదిద్దే చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపడతామని బ్యాంకు వెల్లడించింది.
బ్యాంకు కార్యకలాపాలపై ప్రభావం లేదు
సైబర్ ఘటన జరిగినప్పటికీ, తమ ప్రధాన బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వ్యాపార కొనసాగింపుపై గణనీయమైన ప్రభావం పడలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకు సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. డేటా బహిర్గతానికి సంబంధించిన పూర్తి అంచనా ప్రస్తుతం కొనసాగుతోందని పేర్కొంది.
ఎస్బీఐ ఖాతాదారులు ఏం చేయాలి?
ఈ ఘటన నేపథ్యంలో ఖాతాదారులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచార భద్రతపై అప్రమత్తంగా ఉండటం మంచిది.
బ్యాంకు అధికారులమంటూ వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మవద్దు.
OTP, ATM PIN, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, CVV వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు.
అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు. తెలియని యాప్‌లను ఇన్స్టాల్ చేయవద్దు.
మీ ఖాతాలోని లావాదేవీలను తరచుగా పరిశీలించండి.
అనధికార లావాదేవీలు లేదా మోసపూరిత సంప్రదింపులు ఎదురైతే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి.
తాజావార్తలు
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
-
AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!