NTV Telugu Site icon

Indian Rupee: రూపాయి పతనంపై దయచేసి ఆర్‌బీఐ జోక్యం చేసుకోవద్దు..!

Rupee

Rupee

Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందుకు బదులుగా మరిన్ని ఉద్యోగాలను సృష్టించి.. దేశీయంగా వినియోగం పెంచేందుకు తగిన మద్దతు ఇచ్చే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది.. అలాగే, ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగానే ఇమిగ్రేషన్, టారిఫ్‌లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాఘురామ్ రాజన్ పేర్కొన్నారు.

Read Also: Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

అలాగే, ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు క్రమంగా బలపడటం.. వివిధ దేశాల ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్‌ సుంకాల హెచ్చరికలే దీనికి ప్రధాన కారణం. టారిఫ్‌లు పెంచితే, ఇతర దేశాల నుంచి యూఎస్ కి దిగుమతులు తగ్గిపోవడం.. కరెంట్‌ ఖాతా లోటు, వాణ్యి లోటు కూడా తగ్గడం వల్ల ప్రపంచంలో తక్కువ డాలర్లు ఉంటాయి.. దీంతో డాలరు విలువ ఇంకా బలోపేతం అవుతుంది. యూఎస్ కి ఎగుమతులు చేయలేక కంపెనీలు అన్నీ.. అమెరికాలోనే ఉత్పత్తులు చేయడానికి మొగ్గుచూపుతాయి.

Read Also: MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్

అయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోలేదని మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ఇక, రూపాయి విలువను నిర్దేశిత స్థాయిలో ఉంచడానికి జోక్యం చేసుకోలేమన్నారు. అలాగే, మార్కెట్‌కు తగినట్లుగా రూపాయి తన సొంత స్థాయిని కనిపెట్టడానికి ఆర్‌బీఐ యత్నిస్తుంది. ఒక వేళ రూపాయి విషయంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటే.. భారీ ఊగిసలాటకు దారి తీయడంతో పాటు ఎగుమతిదార్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇక, ఇటీవల ఆర్థిక మందగమనంపై ఆందోళన పడొద్దు.. గత కొన్నేళ్లలో బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాం.. స్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు భారీ పెట్టుబడులు, వినియోగ వృద్ధి చాలా అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నారు.