Jio: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో పలు మార్పులు చేసింది. రూ.249 ధరలో 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా అందించే ప్లాన్‌ను తాజాగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై 1.5 జీబీ/డే ప్లాన్‌లే బేస్ ఆప్షన్‌గా అందుబాటులో ఉండనున్నాయి. దీంతో జియో యూజర్లు ఎక్కువ డేటా ఉన్న ఆప్షన్ల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: HHVM : ఓటీటీలోకి వీరమల్లు.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
కాగా, ఇప్పటికే జియోలో ఈ ప్లాన్ అమల్లోకి వచ్చింది. జియో వెబ్‌సైట్‌లో 1జీబీ ఎంట్రీ లెవల్ ప్లాన్ కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం 28 రోజులకు రూ.299తో 1.5 జీబీ/డే, రూ.349తో 2 జీబీ/డే ప్లాన్లు మాత్రమే అందుబాటులో కొనసాగుతున్నాయి. ఇక, జియో తాజా నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం ఎంతో మందికి అధిక భారం కావొచ్చని, ఇష్టానుసారంగా ప్లాన్స్ ఛేంజ్ చేసుకుంటే పోతుంటే.. ట్రాయ్ నిద్రపోతుందా అని సోషల్ మీడియాలో వినియోగదారులు కామెంట్స్ పెడుతున్నాయి.
Read Also: Team India Opening Pair: ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడి ఇదే.. సంజూ మాత్రం కాదు!
అయితే, సరసమైన ధరలకే రీఛార్జ్ లభించే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో సిగ్నల్స్ సమస్య ఎక్కువుగా వెంటాడుతుందని నెటిజన్స్ పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా బీఎస్ఎన్ఎల్ నెటవర్క్ లో 5జీ తీసుకొచ్చి, మంచి సర్వీస్ ఇస్తే బాగుంటుందని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలుగా పోస్టులు పెడుతున్నారు వినియోగదారులు.