RBI Digital Payment Rules: డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. డబ్బు బదిలీకి గంటలోపు అనుమతి తప్పనిసరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Digital Payment Rules: డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాంకు ఖాతాదారుల డబ్బుకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో కొత్త మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఖాతాదారులు తమకు నమ్మకమైన వ్యక్తిని (Trusted Person) ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది.
ఈ విధానంలో ఖాతాదారులు నిర్ణయించుకున్న పరిమితికి మించి డబ్బు బదిలీ చేయాలంటే, వారు ఎంపిక చేసుకున్న నమ్మకమైన వ్యక్తి గంటలోపు ఆ లావాదేవీకి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఆ వ్యక్తి అనుమతి ఇవ్వకపోతే లావాదేవీ రద్దవుతుంది. డిజిటల్ మోసాల బారిన పడకుండా ఖాతాదారులను రక్షించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది.
Also Read
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- Stock Market Crash: బ్లాక్ మండే.. స్టాక్ మార్కెట్లో భారీ విధ్వంసం.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
- Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
గతంలో ఏప్రిల్‌లో విడుదల చేసిన చర్చాపత్రంలో అధిక మొత్తంలో జరిగే అన్ని డిజిటల్ లావాదేవీలకు తప్పనిసరిగా గంటపాటు కూలింగ్ పీరియడ్ విధించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అయితే తాజాగా విడుదల చేసిన ముసాయిదాలో ఆ ప్రతిపాదనను తొలగించింది. గతంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే నమ్మకమైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని ప్రతిపాదించగా.. ఇప్పుడు ఈ సదుపాయాన్ని బ్యాంకు ఖాతాదారులందరికీ ఐచ్ఛికంగా అందించాలని సూచించింది. అంటే ప్రతి ఖాతాదారుడు తన అవసరాన్ని బట్టి ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి కాదు.
UPI చెల్లింపులకు వర్తించని కొత్త నిబంధన
ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ నమ్మకమైన వ్యక్తి అనుమతి విధానం కొన్ని చెల్లింపులకు వర్తించదు. ముఖ్యంగా..
UPI ద్వారా చేసే నగదు బదిలీలు.
వ్యాపారులకు చేసే చెల్లింపులు (Merchant Payments).
పునరావృత చెల్లింపులు (Recurring Mandates).
ఈ లావాదేవీలకు కొత్త అనుమతి విధానం వర్తించదని ముసాయిదాలో పేర్కొంది.
అత్యవసర సమయంలో అన్ని చెల్లింపులు నిలిపివేసే అవకాశం
డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు ఖాతాదారులకు ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్ (Emergency Stop Switch) సదుపాయాన్ని అందించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. దీని ద్వారా ఖాతాదారులు తమ ఖాతా నుంచి జరిగే అన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపులను అత్యవసర సమయంలో వెంటనే నిలిపివేయవచ్చు. అంతేకాకుండా ఖాతాదారులకు మరికొన్ని నియంత్రణ సదుపాయాలు కూడా అందించాలని సూచించింది.
ఒక్కో లావాదేవీకి గరిష్ఠ నగదు బదిలీ పరిమితిని నిర్ణయించుకోవచ్చు.
ఒక్కో లబ్ధిదారుడికి (Beneficiary) ప్రత్యేకంగా చెల్లింపు పరిమితిని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఏ సమయంలో డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉండాలో నిర్ణయించుకోవచ్చు.
అవసరమైనప్పుడు డిజిటల్ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
ఈ ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ట్రస్టెడ్ పర్సన్, స్టాప్ స్విచ్, ఛానల్ కంట్రోల్ విధానాలను 2027 జూలై 1 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
లావాదేవీ అలర్ట్ పంపకపోతే బ్యాంకుదే బాధ్యత!
డిజిటల్ మోసాల కారణంగా ఖాతాదారులు నష్టపోతే.. అందుకు బ్యాంకుల నిర్లక్ష్యం కారణమైతే బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకుల నిర్లక్ష్యంగా పరిగణించే కొన్ని అంశాలను కూడా ముసాయిదాలో వివరించింది.
అవసరమైన బహుళ స్థాయి ధృవీకరణ (Multi-factor Authentication) కల్పించకపోవడం.
ఖాతాదారులకు లావాదేవీలకు సంబంధించిన SMS లేదా ఇతర అలర్ట్స్ పంపకపోవడం.
బ్యాంకు అంతర్గత భద్రతా వ్యవస్థలో లోపాలు లేదా చొరబాట్లు జరగడం.
బ్యాంకు ఉద్యోగులు మోసాల్లో భాగస్వాములు కావడం లేదా ఇతరులతో కుమ్మక్కవడం.
బ్యాంకుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఈ కొత్త నిర్వచనాన్ని 2027 జనవరి 1 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
దేశంలో UPI, నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలను అరికట్టడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే ఖాతాదారులకు లావాదేవీలపై మరింత నియంత్రణ లభించే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్నాయని, తుది మార్గదర్శకాలు విడుదలైన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమవుతాయని గుర్తుంచుకోవాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
RBI Digital Payment Rules: డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. డబ్బు బదిలీకి గంటలోపు అనుమతి తప్పనిసరి!
-
Koti Deepotsavam 2026: నేడు అరుణాచలేశ్వరుడికి మహానీరాజనం.. కార్తీక పౌర్ణమి వేళ విశేష కార్యక్రమాలు ఇవే..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
AIADMK Internal Rift: స్టాలిన్‌తో ఈపీఎస్ ఫొటో.. అన్నాడీఎంకేలో రాజకీయ దుమారం!
ట్రెండింగ్
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!