Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!
- హాట్ టాపిక్ గా పాట్నా పుష్ప 2 ఈవెంట్
- టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్
- మొత్తం అంతా వాళ్లే చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. నిజానికి బీహార్ రాష్ట్రాన్ని ఒకప్పుడు దోపిడీ దొంగలకు నెలవుగా భావించేవారు. ఇప్పటికీ బీహార్ వెనకబడి ఉన్న రాష్ట్రంగానే చాలామందికి తెలుసు కానీ అలాంటి చోట పుష్ప 2 ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేయడమే ఒక సాహసం. ఆ సాహసాన్ని అత్యంత సునాయాసంగా జరిపి ప్రేక్షకులందరికీ చేత ఇంకేం అల్లు అర్జున్ అభిమానుల చేత ప్రశంసలు కూడా అందుకుంది సినిమా టీం.
Pushpa 2 : పుష్ప గాడి సత్తా చూపించే ప్లాన్ రెడీ చేసిన మైత్రి
Also Read
అయితే ఈ ఈవెంట్ అక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా ఇబ్బందులు కలగకుండా నిర్వహించడానికి ముఖ్య కారణం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన మైత్రి సాయి అలియాస్ బాబాసాయిగా తెలుస్తోంది. పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఆయన ఈవెంట్ విషయంలో అన్ని తానయి వ్యవహరించినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ యువి మీడియాతో కలిసి ఆ సంస్థ అధినేత వెంకట్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ కి రూపకల్పన చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్స్ లో ఒకటిగా ఈ ఈవెంట్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు నార్త్ అంటే ముంబై, ఢిల్లీ మాత్రమే గుర్తొచ్చేవి కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కి పాట్నా లాంటి ప్రదేశంలో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అని వీరిద్దరూ ఒకరకంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!