Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Post Office Savings: సురక్షితమైన పెట్టుబడితో పాటు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం (రెగ్యులర్ ఇన్కమ్) కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ అందించే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. ఇవి కేవలం పెట్టుబడికి రక్షణ ఇవ్వడమే కాకుండా, మంచి రాబడిని అందిస్తూ పెద్ద మొత్తంలో ఫండ్‌ను సమకూర్చుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అలాంటి అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS). ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా రిస్క్ లేని (Zero Risk) పెట్టుబడి మార్గం. ఇందులో మీరు పెట్టే ప్రతి రూపాయికి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా గ్యారెంటీ ఇస్తుంది. కాబట్టి మీ డబ్బుకి ఎలాంటి ఢోకా ఉండదు. రక్షణ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఈ పథకంపై ప్రస్తుతం 7.4% వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. దీని మెచ్యూరిటీ కాల వ్యవధి 5 సంవత్సరాలు.
పోస్ట్ ఆఫీస్ MIS అనేది ఒక ‘వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్’ స్కీమ్, అంటే ఖాతా తెరిచే సమయంలో ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు డిపాజిట్ చేసిన సమయంలో నిర్ణయించబడిన వడ్డీ రేటు ఆధారంగా వచ్చే నెలవారీ ఆదాయం, 5 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ఎలాంటి మార్పు లేకుండా ప్రతి నెలా లభిస్తుంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను పెంచినా లేదా తగ్గించినా, మీ నెలవారీ రాబడిపై దాని ప్రభావం ఉండదు. ఈ ప్రభుత్వ పథకంలో చిన్న మొత్తంతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. కేవలం రూ. 1,000 తోనే ఖాతాను ప్రారంభించే వెసులుబాటు ఉంది. ఇందులో సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి విషయానికి వస్తే, సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, అదే జాయింట్ ఖాతా అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు.
Also Read
- Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
- 14K vs 18K vs 22K Gold: బంగారం స్వచ్ఛత ఎంత? 14K, 18K, 22K మధ్య తేడాలు ఇవే..
ఇక, ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ. 9,000 కంటే ఎక్కువ రాబడి ఎలా పొందాలో చూద్దాం. దీనికోసం మీరు ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి, అందులో గరిష్ట పరిమితి అయిన రూ. 15 లక్షలను ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 7.4% వడ్డీ రేటు ప్రకారం, మీ రూ. 15 లక్షల డిపాజిట్‌పై ప్రభుత్వం ప్రతి నెలా రూ. 9,250 లను వడ్డీ రూపంలో మీ ఖాతాలో జమ చేస్తుంది. మెచ్యూరిటీ వరకు అంటే ఐదేళ్ల పాటు ఈ ఆదాయం మీకు క్రమం తప్పకుండా అందుతూనే ఉంటుంది. మీ అసలు రూ. 15 లక్షల డిపాజిట్ అలాగే సురక్షితంగా ఉంటూ, కేవలం వడ్డీ ద్వారానే ఈ నెలవారీ సంపాదన సాధ్యమవుతుంది.
తాజావార్తలు
-
FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
-
CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
-
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
-
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!