Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Mass Moment: వెండితెరపై తమదైన మాస్ మేనియాతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసి సినీ ప్రియులకు కనువిందు చేశారు. తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ సాధించిన ప్రభంజనం టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తుండగా, చిత్ర బృందానికి ఊహించని మెగా సర్ప్రైజ్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రవితేజతో పాటు డైరెక్టర్ శివ నిర్వాణ, చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌ను ప్రత్యేకంగా తమ ఇంటికి ఆహ్వానించారు. చిరుతో పాటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ వేడుకలో భాగమై టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మూవీ సక్సెస్‌పై మాట్లాడిన మెగా బాస్, రవితేజ ఎనర్జీని, డైరెక్టర్ పనితీరును ప్రత్యేకంగా కొనియాడారు.
రవితేజ, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం కేవలం సినిమాకే పరిమితం కాదన్న విషయం పరిశ్రమలో అందరికీ తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’లో అన్నదమ్ములుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరు మాస్ హీరోలు, ఇప్పుడు నిజజీవితంలోనూ ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకుంటున్న తీరు అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. తోడుగా చరణ్ కూడా చేరడంతో అక్కడ పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ ఫొటోలు బయటకు రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “రియల్ మెగా మాస్ మూమెంట్” అంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కంటెంట్ బాగుంటే పరిశ్రమలోని పెద్దలంతా ఇలా ఒక్కటై ప్రోత్సహిస్తారని మరోసారి నిరూపితమైందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఇరుముడి’ సాధించిన ఈ గ్రాండ్ సక్సెస్, మెగా కాంప్లిమెంట్స్‌తో రెట్టింపు ఉత్సాహాన్ని సంతరించుకుంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
A MEGA MASS MOMENT ❤️
Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu along with the team of #Irumudi and congratulated them on the film’s massive success ❤️🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRr5N#IRUMUDI /… pic.twitter.com/naNJUK91HV— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!