Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా క్షీణించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు వెనక్కి వెళ్తుండటంతో రూపాయి విలువ ఏకంగా రూ.96.68 మార్కును దాటి సరికొత్త రికార్డు స్థాయి పతనానికి చేరుకుంది. ఈ పరిణామం దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ కరెన్సీకి అండగా నిలిచేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరతను తీర్చేందుకు భారత కేంద్ర బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగింది.
మే 26, 2026న భారీ ఎత్తున 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.41,000 కోట్లకు పైగా) విలువైన ‘డాలర్-రూపీ బై/సెల్ స్వాప్ ఆక్షన్’ నిర్వహించనున్నట్లు ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. మూడేళ్ల సుదీర్ఘ గడువుతో కూడిన ఈ ప్రత్యేక ఆర్థిక చర్య ద్వారా మార్కెట్లో స్థిరత్వం తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఆర్బీఐ, దేశంలోని కమర్షియల్ బ్యాంకుల మధ్య జరుగుతుంది.
Also Read
- E20 Ethanol Blending: E20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్.. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు, 10 అంశాలతో వివరణ
- EPFOలో కీలక మార్పులు.. పోర్టల్‌లో రెండు సేవలకు ముగింపు..
- RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
- Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
మొదట మే 26న జరిగే వేలంలో అర్హత గల బ్యాంకులు తమ వద్ద ఉన్న యూఎస్ డాలర్లను ప్రస్తుత రిఫరెన్స్ రేటు ప్రకారం ఆర్బీఐకి విక్రయిస్తాయి. దానికి బదులుగా ఆర్బీఐ నుంచి భారీ మొత్తంలో భారతీయ రూపాయలను పొందుతాయి. ఇది మే 29, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. రెండో దశలో.. ఈ ఒప్పందం ప్రకారం, సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే మే 29, 2029న, బ్యాంకులు తాము ఆర్బీఐకి అమ్మిన డాలర్లను ముందే నిర్ణయించుకున్న ప్రీమియం రేటు చెల్లించి తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో పాల్గొనడానికి కనీస బిడ్ పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. బ్యాంకులు తమకు నచ్చిన ప్రీమియం మొత్తాన్ని పైసల రూపంలో కోట్ చేస్తూ ఎన్ని బిడ్లయినా దాఖలు చేయవచ్చు.
రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోకుండా నియంత్రించడానికి ఆర్బీఐ మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో రూపాయి కొరత ఏర్పడింది.
ఇప్పుడు ఈ రూ.41,000 కోట్ల విలువైన స్వాప్ ఆక్షన్ ద్వారా మార్కెట్లోకి శాశ్వత ప్రాతిపదికన రూపాయి నిధులు వచ్చి చేరుతాయి. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత పెరిగి, వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. అలాగే విదేశీ మారక నిల్వలకు తాత్కాలికంగా డాలర్ల అండ లభిస్తుంది. ఫలితంగా, డాలర్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్ కాస్త తగ్గి, రూపాయి మరింత దిగజారకుండా బ్రేకులు పడతాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
E20 Ethanol Blending: E20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్.. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు, 10 అంశాలతో వివరణ
-
Vaibhav Sooryavanshi Debut: ఆడించమని వైభవ్ సూర్యవంశీకి చెప్పండి!
-
FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
-
Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
-
VFX : ‘రావు బహదూర్’ వీఎఫ్ఎక్స్ వెనుక తెలుగు వ్యక్తి
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!