RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: భారతదేశ విదేశీ మారక నిల్వలు, బంగారు నిల్వలు గణనీయంగా తగ్గినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్ 26, 2026తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 5.654 బిలియన్ డాలర్లు తగ్గి 666.933 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో మాత్రం విదేశీ మారక నిల్వలు 963 మిలియన్ డాలర్లు పెరిగి 672.587 బిలియన్ డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. ఆర్బీఐ వివరాల ప్రకారం, విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 150 మిలియన్ డాలర్లు తగ్గి 541.067 బిలియన్ డాలర్లకు చేరాయి. యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికేతర కరెన్సీల మారకపు విలువల్లో వచ్చిన హెచ్చుతగ్గులు కూడా ఈ తగ్గుదలపై ప్రభావం చూపినట్లు పేర్కొంది.
ఇక బంగారు నిల్వల్లో ఒకే వారంలో భారీ క్షీణత నమోదైంది. బంగారు నిల్వలు 5.394 బిలియన్ డాలర్లు తగ్గి 102.536 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) విలువ 89 మిలియన్ డాలర్లు తగ్గి 18.558 బిలియన్ డాలర్లకు చేరగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద భారత రిజర్వ్ పొజిషన్ కూడా 21 మిలియన్ డాలర్లు తగ్గి 4.7772 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఫిబ్రవరి 27, 2026తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 728.494 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే అనంతరం పశ్చిమ ఆసియాలో పెరిగిన భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాలు రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. రూపాయి విలువను స్థిరీకరించేందుకు ఆర్బీఐ మార్కెట్లో డాలర్లను విక్రయించడం వంటి చర్యలు చేపట్టడంతో విదేశీ మారక నిల్వలు తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
ఇదిలా ఉండగా, దేశంలో విదేశీ మారక వ్యయాన్ని తగ్గించేందుకు బంగారం దిగుమతులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు దిగుమతి సుంకాలను కూడా పెంచింది. దీంతో బంగారం దిగుమతులు తగ్గి, బంగారు నిల్వలపై కూడా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు దేశ విదేశీ మారక నిల్వల్లో తాత్కాలిక ఒత్తిడిని సూచిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారకపు విలువ, ప్రపంచ మార్కెట్ పరిణామాలు రానున్న రోజుల్లో ఈ నిల్వల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!