FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026 Round 16: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ పోటీలు, రౌండ్ ఆఫ్ 32 ముగియడంతో ఇప్పుడు సమరం రౌండ్ ఆఫ్ 16కు రంగం సిద్ధమైంది. రౌండ్ ఆఫ్ 16లో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజ జట్లు తలపడనున్నాయి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై (నాకౌట్) కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
రౌండ్ ఆఫ్ 16లో తొలి మ్యాచ్‌లో కెనడా, మొరాకో జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత పరాగ్వే, ఫ్రాన్స్ మధ్య పోరు జరగనుంది. మరో కీలక మ్యాచ్‌లో బ్రెజిల్, నార్వే జట్లు పోటీ పడనున్నాయి. ఫుట్‌బాల్‌లో ఐదు సార్లు ప్రపంచ కప్ గెలిచిన బ్రెజిల్ మరోసారి టైటిల్ వేటలో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే రోజు మెక్సికో, ఇంగ్లండ్ జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఇంగ్లండ్ జట్టు తమ దూకుడు కొనసాగించాలని చూస్తుండగా.. మెక్సికో సంచలనం సృష్టించాలని చూస్తోంది.
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
రౌండ్ ఆఫ్ 16లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్‌లలో పోర్చుగల్-స్పెయిన్ పోరు ఒకటి. యూరప్‌కు చెందిన ఈ రెండు బలమైన జట్లు తలపడటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే అమెరికా, బెల్జియం జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా అభిమానులను ఆకట్టుకోనుంది. ఇక మరోవైపు అర్జెంటీనా, ఈజిప్ట్ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. గత ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఆ మ్యాచ్ తర్వాత స్విట్జర్లాండ్, కొలంబియా జట్ల మధ్య కూడా హోరాహోరీ పోరు జరగనుంది.

మొత్తంగా చూస్తే.. ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనున్నట్లు కనిపిస్తోంది. బ్రెజిల్, ఫ్రాన్స్, అర్జెంటీనా, ఇంగ్లండ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి ఫుట్‌బాల్ దిగ్గజాలు బరిలో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానుల దృష్టి ఈ నాకౌట్ పోరులపైనే ఉంది. క్వార్టర్ ఫైనల్‌కు చేరే జట్లు ఏవో తేల్చే ఈ మ్యాచ్‌లు ఫుట్‌బాల్ ప్రేమికులకు అసలైన పండుగగా మారనున్నాయి.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!