Prasar Bharati: ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి శుభవార్త.. ఇకపై ఇవన్నీ ఫ్రీ!
- ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి శుభవార్త
- వేవ్స్ పేరుతో సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ
- రామాయణం.. మహాభారతం.. ఇతర ఛానల్స్ ఫ్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి అదిరిపోయే శుభవార్త చెప్పింది. మన దేశంలో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఇంట్లోనే కూర్చుని.. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఓటీటీ ఇప్పుడు మంచి ప్లాట్‌ఫామ్. నచ్చిన సినిమాలు, వినోద కార్యక్రమాలు చూసేందుకు ఎక్కువగా ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. అలాంటి ఓటీటీ లవర్స్‌కి కేంద్ర ప్రభుత్వ ప్రసార భారతి సొంత ఓటీటీని తీసుకొచ్చింది. వేవ్స్ పేరుతో సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్లకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఓటీటీ వేదికగా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా అందిస్తామని తెలిపింది.
ఇది కూడా చదవండి: Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్
Also Read
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
బుధవారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం వేదికగా ప్రసార భారతి తమ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌ను ఆవిష్కరించింది. ఓటీటీ ద్వారా రామాయణం, మాహాభారతంతో పాటు రేడియో కార్యక్రమాలు, భక్తి పాటలు, ఆటలు, ఈ-బుక్స్ వంటివి సైతం ఉచితంగానే అందిస్తామని వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. పెద్ద వారి కోసం అలనాటి చిత్రాలు, మదురమైన పాటలు ఇందులో ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు పిల్లల కోసం వినోద కార్యక్రమాలైన ఛోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెలనాలీరామ్ వంటి యానిమేటెడ్ సినిమాలు సైతం అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇటీవల బీఎస్ఎన్‌ఎల్ కూడా లైవ్ టీవీని ప్రారంభించింది. డేటా లేకుండానే ఉచితంగా ఛానల్స్ చూసే అవకాశం కల్పించింది.
ఇది కూడా చదవండి: President Droupadi Murmu: కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!