Post Office Scheme: ఈ రోజుల్లో రేపటి అవసరాలకు నేటి నుంచే కూడబెట్టాలి అంటున్నారు పెద్దలు. పేద, బలహీన వర్గాలు, మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని పోస్టాఫీస్ బంఫర్ స్కీమ్‌ను పట్టుకొని వచ్చింది. దీనిని పోస్ట్ ఆఫీస్ వార్షిక బీమా పాలసీ అని పిలుస్తారు. ఇందులో ఏడాదికి కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షల వరకు బీమా పాలసీని పొందవచ్చని చెబుతున్నారు. ప్రతి ఒకరూ ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే బీమా అనేది కుటుంబానికి దీమాగా పని చేస్తుందని, తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు, ప్రమాదవశాస్తు వారికి ఏమైనా జరిగినా ఈ పాలసీతో వాళ్ల కుటుంబం ఆర్థిక ఒత్తిడికి లోనుకాకుండా ఉంటుందని అంటున్నారు.
READ ALSO: OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?
18 నుంచి 65 వయస్సు వాళ్లు చేరవచ్చు..
ఈ పాలసీలో ఏడాదికి రూ.565 మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ప్రతి రోజు ఖర్చు చేసే అనేక డబ్బుల్లో ఈ మొత్తం చాలా తక్కువ. కాబట్టి వెంటనే ప్రజలు ఈ పాలసీపై దృష్టి సారించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇంత చిన్న పెట్టుబడికి ప్రతిఫలంగా, బీమా పొందిన వ్యక్తి రూ.10 లక్షల వరకు బీమా కవర్ పొందవచ్చని చెబుతున్నారు. ఈ పాలసీలో 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఎవరైనా ఈ పాలసీలో చేరవచ్చు. ఈ బీమా పాలసీ సహజ మరణాన్ని మాత్రమే కాకుండా ప్రమాదవశాత్తు మరణం, పాక్షిక వైకల్యాన్ని కూడా కవర్ చేస్తుందని అంటున్నారు.
టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు..
ఈ పథకంలో చేరే ముందు ఎవరైనా ఎటువంటి మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ బీమా పాలసీ సహజ మరణాన్ని మాత్రమే కాకుండా ప్రమాదవశాత్తు మరణం, పాక్షిక వైకల్యాన్ని కూడా కవర్ చేస్తుందని పేర్కొన్నారు. అటువంటి సందర్భాలలో నామినీ రూ.10 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చని, జీవిత బీమాతో పాటు, ప్రమాద సంబంధిత గాయం కారణంగా ఇన్‌పేషెంట్ చికిత్స పొందినట్లయితే ఈ పాలసీ రూ.1 లక్ష వరకు వైద్య ప్రయోజనాలను చేకూరుస్తుందని చెబుతున్నారు. దీనితో పాటు ఈ పాలసీలో పాలసీదారుడికి పలు బోనస్ ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపారు.
పాలసీలో జాయిన్ ఎలా అవ్వాలంటే..
పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వాళ్లు వెంటనే మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌లో ఒక ఖాతా తెరవడానికి వెళ్లాలి. అక్కడ ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు.. ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటరు ఐడి కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అవసరం అవుతాయి. మీరు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో ఈ పాలసీ గురించి చర్చించి.. దీని గురించి పూర్తి వివరాలను తెలిసుకొని.. ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత కొద్ది సేపటికే మీ పాలసీ వెంటనే యాక్టివేట్ అవుతుంది.
READ ALSO: Afghanistan: అమెరికాకు ఆఫ్ఘన్ సవాల్.. ‘రాజీపడే ప్రసక్తే లేదు’