Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికిల్ కొనేవారికి భారీ శుభవార్త చెప్పిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ-డ్రైవ్’ (PM E-DRIVE) పథకంలో తాజాగా కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ పథకం ద్వారా లభించే రాయితీలు, గడువు తేదీలు.. ఇతర నిబంధనలను సవరిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఈ పథకం మొత్తం రూ.10,900 కోట్ల బడ్జెట్‌తో నడుస్తోంది. ఇది నిధులతో ముడిపడి ఉన్న ప్రోగ్రామ్. ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులు పథకం ముగింపు తేదీ కంటే ముందే అయిపోతే.. అప్పటికప్పుడు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. ఆ తర్వాత ఎటువంటి రాయితీ దరఖాస్తులను స్వీకరించరు. మునుపటి నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ టూవీలర్లకు రాయితీ పొందే గడువు మార్చి 31, 2026 వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దీనిని జూలై 31, 2026 వరకు పొడిగించారు. అంటే ఈ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (ఈ-రిక్షాలు, ఈ-కార్టులు) విషయానికి వస్తే, వీటికి మునుపటి గడువు తేదీ అయిన మార్చి 31, 2028 వరకు రాయితీలు అందుబాటులో ఉంటాయి.
Also Read
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ధరల పరిమితి..
అన్ని వాహనాలకు ఈ రాయితీ వర్తించదు. వాహనం కంపెనీ ధర ఆధారంగా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఎలక్ట్రిక్ టూవీలర్ల విషయానికి వస్తే.. వీటి ధర రూ.1.5 లక్షల లోపు ఉంటేనే రాయితీకి అర్హత ఉంటుంది. ఈ-రిక్షాల విషయానికి వస్తే.. వీటి ధర రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
Also Read:Gas Cylinder Robbery: గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..
వాహనాల సంఖ్యపై పరిమితి..
ప్రభుత్వం రాయితీ ఇచ్చే వాహనాల సంఖ్యను కూడా ఖరారు చేసింది. ఈ పథకం కింద గరిష్టంగా 24,79,120 ఎలక్ట్రిక్ టూవీలర్లకు మాత్రమే మద్దతు లభిస్తుంది. ఈ-రిక్షాల సంఖ్యను 39,034 యూనిట్లకు పరిమితం చేశారు. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (L5 విభాగం) లక్ష్యం అప్పటికే పూర్తయినందున.. వీటికి సంబంధించిన రాయితీలను డిసెంబర్ 26, 2025 నుంచే నిలిపివేశారు.
రాయితీ ఎంత ఉంటుంది..?
వాహనం బ్యాటరీ సామర్థ్యం (kWh) ఆధారంగా ఇచ్చే రాయితీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట మొత్తం లేదా వాహనం ధరలో గరిష్టంగా 15 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానినే రాయితీగా ఇస్తారు. పర్యావరణాన్ని కాపాడుతూ.. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ పథకం గొప్ప అవకాశం. అయితే నిధులు, వాహనాల సంఖ్యపై పరిమితి ఉన్నందున.. ముందుగా కొనుగోలు చేసిన వారికే ఈ ప్రయోజనం చేకూరుతుంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!