Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..
- ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసే వారికి శుభవార్త..
- రోడ్‌స్టర్ వాహనం ధర భారీగా తగ్గించిన ఓలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయిన రోడ్‌స్టర్ X+ 9.1 kWh ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ బైక్ ధర రూ. 1,89,999 ఉండగా.. ఇప్పుడు అది కేవలం రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) కే లభించనుంది.
ధర ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి..?
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఖర్చే అత్యధికంగా ఉంటుంది. ఓలా కంపెనీ తన ‘గిగా ఫ్యాక్టరీ’లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ‘4680 భారత్ సెల్’ అనే బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ సెల్స్ ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడంతో తయారీ ఖర్చులు బాగా తగ్గాయి. సొంతంగా బ్యాటరీలు తయారు చేసుకోవడం వల్ల కలిగిన ఈ ఆర్థిక లాభాన్ని కంపెనీ నేరుగా కస్టమర్లకే బదిలీ చేయాలని నిర్ణయించుకుంది.
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్‌బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు..?
అయితే.. ఈ బైక్‌ను ఎప్పుడు పడితే అప్పుడు కొనే అవకాశం లేదు. దీనిని కేవలం పరిమిత సమయ విండోల్లో (Limited Purchase Windows) మాత్రమే విక్రయించాలని ఓలా నిర్ణయించింది.
మొదటి కొనుగోలు అవకాశం ఏప్రిల్ 3న (శుక్రవారం) సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఇలాంటి మరిన్ని సేల్ విండోలను భవిష్యత్తులో ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.
రోడ్‌స్టర్ X+ ప్రత్యేకతలు..
ఈ బైక్ పనితీరు విషయానికి వస్తే, ఇది ఒక రేంజ్ కింగ్ అని చెప్పవచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్‌కు డిమాండ్ 5 రెట్లు పెరిగిందని కంపెనీ చెబుతోంది.
పుంజుకున్న ఓలా అమ్మకాలు..
గత మార్చి నెలలో ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రిజిస్ట్రేషన్లు 150 శాతం పెరిగాయి. ఆ నెలలో మొత్తం 10,117 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి చివరి వారంలో ప్రతిరోజూ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లు రావడం గమనార్హం. కేవలం వాహనాల అమ్మకాలే కాకుండా.. సర్వీస్ సెంటర్ల మెరుగుదల, కస్టమర్ల నమ్మకాన్ని గెలవడంలో ఓలా సఫలమైందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి.. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఓలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!