NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NSE Listing: స్టాక్ మార్కెట్లో రక్తపాతం నడుస్తున్న వేళ.. ఒకే ఒక్క స్టాక్ మాత్రం దలాల్ స్ట్రీట్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. దేశీయ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో, భారత అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ (NSE) సరికొత్త చరిత్ర లిఖించింది. బీఎస్ఈ వేదికగా లిస్టయిన క్షణాల్లోనే అద్భుత రికార్డులను తిరగరాసి ఔరా అనిపించింది. కేవలం ఒకే ఒక్క అడుగుతో దేశంలోనే అత్యంత విలువైన టాప్-10 కంపెనీల ఎలైట్ క్లబ్‌లోకి దూసుకెళ్లి దిగ్గజ కార్పొరేట్ సంస్థలనే విస్మయానికి గురిచేసింది.
రూ. 4.56 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్..
బీఎస్ఈలో అడుగుపెట్టిన వెంటనే ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ ఏకంగా రూ. 4.56 లక్షల కోట్లకు చేరింది. ఈ దూకుడుతో హిందుస్థాన్ యూనిలీవర్ (HUL), ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, టైటాన్ వంటి దశాబ్దాల చరిత్ర కలిగిన బడా కంపెనీల మార్కెట్ క్యాప్‌ను వెనక్కి నెట్టి, భారత్‌లోనే 10వ అత్యంత విలువైన కంపెనీగా NSE అవతరించడం విశేషం. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలోనూ ఈ ఘనత సాధించడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్ఎస్ఈ ఐపీవో ఇష్యూ ధర రూ.1,785 కాగా, బీఎస్ఈలో రూ.1,800 వద్ద నామమాత్రపు ప్రీమియంతో (1% కంటే తక్కువ) లిస్టయింది. అయితే ఆ తర్వాత కొనుగోళ్ల జోరు అనూహ్యంగా పుంజుకుంది. నిమిషాల వ్యవధిలోనే స్టాక్ దాదాపు 5 శాతం ఎగబాకి గరిష్టంగా రూ.1,878 స్థాయిని తాకింది. ఆ తర్వాత కాస్త స్థిరపడి 3.36 శాతం లాభంతో రూ. 1,845 వద్ద ట్రేడింగ్ కొనసాగించింది. అన్నింటి కంటే పెద్ద సెన్సేషన్ ఏమిటంటే.. లిస్టింగ్ అయిన ఫస్ట్ గంటలోనే దాదాపు కోటి (9.8 మిలియన్లు) ఎన్ఎస్ఈ షేర్లు చేతులు మారాయి. ఒక్క గంట వ్యవధిలోనే దాదాపు రూ.1,800 కోట్ల విలువైన ట్రేడింగ్ వాల్యూమ్ నమోదు కావడం మార్కెట్ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలిచిందని చెబుతున్నారు.
Also Read
- Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
- Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
ఐపీవో విశేషాలు
సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు సాగిన రూ.22,569 కోట్ల విలువైన ఈ మెగా ఐపీవో 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో క్యూఐబీ విభాగం 12.68 రెట్లు, ఎన్ఐఐ విభాగం 6.55 రెట్లు రెస్పా్న్స్ దక్కించుకోగా, రిటైల్ కేటగిరీ 1.39 రెట్లు స్పందించింది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో భాగంగా దాదాపు 12.64 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ఎన్ఎస్ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా సరికొత్త శకానికి నాంది పలికింది. మార్కెట్ నష్టాల సుడిగుండంలో ఉన్నప్పటికీ, ఎన్ఎస్ఈ నమోదు చేసిన ఈ రికార్డు ఎంట్రీ ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తాజావార్తలు
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
-
Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!