Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కార్మిక చట్టాల (New Labour Rules) అమలుతో భారతీయ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సామాజిక భద్రతను పెంచడం, పని ప్రదేశాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పించడం. పాత నిబంధనల ప్రకారం ఉన్న ఎన్నో లొసుగులను సరిచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సంస్కరణలను తీసుకువచ్చింది.
ముఖ్యంగా వేతన నిర్మాణం మారడం వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలు మెరుగుపడతాయి. గతంలో కంటే స్పష్టమైన నిబంధనలతో కంపెనీల జవాబుదారీతనాన్ని పెంచుతూ.. ఉద్యోగుల హక్కులకు పెద్దపీట వేయడం ఈ చట్టాల వెనుక ఉన్న అసలు లక్ష్యం. ప్రతి ఉద్యోగి తన జీతం, సెలవులు, సెటిల్మెంట్ల విషయంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఈ కొత్త సౌలభ్యాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
ఈ కొత్త నిబంధనల వల్ల కలిగే ప్రధాన మార్పులను పరిశీలిస్తే.. మొదటగా వేతన నిర్మాణంలో భారీ మార్పు చోటుచేసుకుంది. పాత నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ కనీసం 30 శాతం ఉండగా.. కొత్త రూల్స్ ప్రకారం ఇది CTCలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల ప్రతి నెలా కట్ అయ్యే పీఎఫ్ (PF) పెరుగుతుంది, ఫలితంగా భవిష్యత్తులో ఉద్యోగికి అందే రిటైర్మెంట్ ఫండ్ మరింత బలంగా ఉంటుంది. గ్రాట్యుటీ విషయంలో కూడా కేంద్రం ఊరటనిచ్చింది. గతంలో 5 ఏళ్లు ఒకే సంస్థలో పని చేస్తేనే వచ్చే గ్రాట్యుటీ, ఇకపై కేవలం 1 సంవత్సరం సర్వీస్ పూర్తి చేసినా లభిస్తుంది.
పని వేళలు , జీతాల చెల్లింపుల్లో కూడా నిబంధనలు కఠినతరం అయ్యాయి. ప్రతి నెలా 10వ తేదీ లోపు వచ్చే జీతం, ఇకపై 7వ తేదీ లోపే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. పని గంటల విషయానికి వస్తే.. వారానికి గరిష్టంగా 48 గంటల పని పరిమితిని విధించారు. ఒకవేళ ఎవరైనా రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే (Overtime), వారికి పాత పద్ధతులతో సంబంధం లేకుండా రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా, ఉద్యోగం వదిలేసినప్పుడు ఇచ్చే ‘ఫుల్ అండ్ ఫైనల్’ (F&F) సెటిల్మెంట్ను పాత చట్టాల మాదిరిగా నెలల తరబడి ఆలస్యం చేయకుండా, కేవలం 2 పని దినాల లోపే పూర్తి చేయాలని ఈ కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. ఇవన్నీ కలిపి ఒక సామాన్య ఉద్యోగికి మెరుగైన ఆర్థిక భరోసాను కల్పిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి అమలుకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా తుది నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. వచ్చే నెల నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!