Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrithik Roshan Divorce: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఇంటీరియర్ డిజైనర్ సుసాన్ ఖాన్ విడాకులు తీసుకుని దాదాపు దశాబ్దం గడిచిపోయింది. అయితే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని పుకార్లు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విడాకుల సమయంలో సుసాన్ ఖాన్ హృతిక్ రోషన్ నుంచి 400 కోట్ల భరణం తీసుకున్నారనే ప్రచారం ఎన్నో ఏళ్లుగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ ఆరోపణలపై సుసాన్ ఖాన్ సోదరి ఫరా అలీ ఖాన్ స్పందిస్తూ, ఈ ప్రచారానికి పూర్తిగా చెక్ పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేశారు. విడాకుల అనంతరం సుసాన్ ఖాన్ హృతిక్ రోషన్ నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదని ఫరా అలీ ఖాన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 400 కోట్ల భరణం వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా నిరాధారమైన ప్రచారమని ఆమె తేల్చిచెప్పారు. వాస్తవాలకు దూరంగా ఉన్న ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మొద్దని కూడా విజ్ఞప్తి చేశారు.
హృతిక్ రోషన్, సుసాన్ ఖాన్ తమ వైవాహిక జీవితానికి 2014లో ముగింపు పలికారు. అయితే విడాకుల తర్వాత కూడా వారిద్దరూ తమ ఇద్దరు కుమారుల పెంపకంలో కలిసి బాధ్యతలు పంచుకుంటున్నారు. సుసాన్ ఖాన్ వ్యక్తిత్వం గురించి కూడా ఫరా అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు కంటే బంధాలకు, మనుషుల మధ్య ఉన్న అనుబంధానికే సుసాన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆమె పేర్కొన్నారు. అందుకే ఆధారాలు లేని వార్తలను నిజమని నమ్మకుండా, వాస్తవాలను తెలుసుకుని స్పందించాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ నటి సబా ఆజాద్‌తో రిలేషన్లో ఉండగా, సుసాన్ ఖాన్ నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ హృతిక్, సుసాన్ మధ్య గౌరవం ఏమాత్రం తగ్గకుండా, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ కలిసి ముందుకు సాగుతున్నారు. తాజాగా ఫరా అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నాళ్లుగానో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 400 కోట్ల భరణం ప్రచారానికి మరోసారి గట్టి సమాధానం లభించినట్టైంది.
Also Read
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
Farah Khan Ali has dismissed long-standing rumours claiming Sussanne Khan received Rs 400 crore in alimony from ex-husband Hrithik Roshan. Calling the reports “completely false,” Farah said Sussanne “did not take anything” and described her as “not a gold-digger,” adding that the… pic.twitter.com/rBAgzw6yYt
— India Forums (@indiaforums) July 3, 2026
- Tags
- cinema
- hrithik roshan
తాజావార్తలు
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!