Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bela Bajaria: గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. స్టాక్ మార్కెట్లో షేర్ల పతనం, సబ్స్క్రైబర్ల వృద్ధిలో తీవ్ర స్తబ్ధత, ఏకంగా వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపుల మధ్య ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన చీఫ్ కంటెంట్ ఆఫీసర్ (CCO) బేలా బజారియాను సంస్థ అర్థాంతరంగా సాగనంపింది. నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొంటున్న వ్యాపార లోపాలను, అసలైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆమెను ‘బలిపశువు’గా మార్చారన్న వాదనలు ఇప్పుడు వినోద పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2016లో నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టిన బేలా బజారియా, అంతకుముందు సీబీఎస్ (CBS), ఎన్బీసీ యూనివర్సల్ వంటి ప్రతిష్టాత్మక నెట్‌వర్క్‌లలో పనిచేసి యూనివర్సల్ టెలివిజన్ హెడ్‌గా గుర్తింపు పొందారు. 2023లో ఆమె నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ కంటెంట్ పగ్గాలు చేపట్టారు. నెట్‌ఫ్లిక్స్‌ను కేవలం ఇంగ్లీష్ ప్లాట్‌ఫామ్‌గా కాకుండా ప్రపంచంలోని వివిధ స్థానిక భాషల కంటెంట్‌తో విస్తరించడంలో ఆమె వ్యూహాలే కీలకంగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు డజన్ల అంతర్జాతీయ కార్యాలయాల ఏర్పాటుతో పాటు డబ్ల్యూడబ్ల్యూఈ (WWE), ఎన్ఎఫ్ఎల్ (NFL) వంటి లైవ్ స్పోర్ట్స్ డీల్స్ కుదుర్చుకోవడంలోనూ ఆమె ప్రదర్శించిన ప్రతిభ సంస్థకు యాడ్-సపోర్టెడ్ ప్లాన్లలో సరికొత్త సబ్స్క్రైబర్లను తీసుకొచ్చిందని చెబుతారు.
బేలా బజారియాను తప్పించడానికి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అధికారిక కారణాన్ని వెల్లడించలేదు. అయితే కంపెనీ తన వ్యాపార మందగమనాన్ని నెట్టేందుకు కంటెంట్ విభాగాన్నే లక్ష్యంగా చేసుకుందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఒకేసారి వెయ్యి మందిని ఇంటికి పంపించే పరిస్థితి వచ్చిందంటే లోపం మొత్తం సంస్థ బిజినెస్ మోడల్లోనే ఉంది కానీ ఒక్క కంటెంట్ హెడ్ వైఫల్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2026 ప్రథమార్థంలో యూజర్ ఎంగేజ్మెంట్ కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. ఈ నత్తనడకను ఇటీవల కో-సీఈఓ టెడ్ సరండోస్ సైతం అంగీకరించారు. దీనికితోడు 2026 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులలో నెట్‌ఫ్లిక్స్ కేవలం 16 పురస్కారాలకే పరిమితమైంది. ఇది 2016 తర్వాత సంస్థ నమోదు చేసిన అత్యంత పేలవమైన ప్రదర్శన. బ్రిడ్జర్టన్ వంటి షోలు ఉన్నప్పటికీ ‘స్ట్రేంజర్ థింగ్స్’ స్థాయి గ్లోబల్ హిట్ ఇటీవల రాకపోవడం ఆమెపై ఒత్తిడి పెంచింది. కానీ, ఆదాయాన్ని పెంచుకోవడానికి సబ్స్క్రిప్షన్ ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేనప్పుడు… నిందలను కేవలం కంటెంట్ హెడ్‌పై మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు జవాబుదారీతనం వహించాల్సింది సీఈఓ, సీఎఫ్ఓలు కాదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020లో తొలితరం హిట్ షోల రూపకర్త సిండీ హాలండ్‌ను పక్కనపెట్టిన తరహాలోనే ఇప్పుడు బేలా బజారియాను కూడా తొలగించారని ఇండస్ట్రీ గుర్తుచేస్తోంది. కాగా నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్, టీవీ విభాగాల నూతన సారథిగా డిస్నీ, ఫాక్స్, ఫాక్స్ సెర్చ్‌లైట్ వంటి సంస్థల్లో సుదీర్ఘ అనుభవం గల పీటర్ రైస్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ సంక్షోభంలో ఉన్న సంస్థను ఆయన ఎలాంటి వ్యూహాలతో గట్టెక్కిస్తారనేది ఇప్పుడు హాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!