Resignation: రూ. 19 కోట్ల కంపెనీకి ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ), అయితే ప్రస్తుతం ఆయన చేసిన రాజీనామా మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మామూలుగా రాజీనామాను మెయిల్ ద్వారా తన పైస్థాయి అధికారులకు పంపిస్తుంటారు. అయితే ఇతను మాత్రం తన రాజీనామా లేఖను పిల్లలు రాసుకునే స్కూల్ బుక్ పేజీపై తన సొంతంగా చేతితో రాసిన రాజీనామా లేఖను ఎండీకి పంపాడు.
Read Also: Ivanka Trump: ఇజ్రాయిల్‌లో ట్రంప్ కూతురు.. అక్టోబర్ 7 బాధితులకు పరామర్శ..
పెయింట్ తయారీ సంస్థ మిత్షి ఇండియాలో సీఎఫ్ఓగా పనిచేస్తున్న రింకూ పటేల్ డిసెంబర్ 1న కంపెనీ ఎండీకి ఈ లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రింకూ పటేల్ రాజీనామా విషయాన్ని మిత్షి సంస్థ బాంబే స్టాక్ ఎక్సేంజి(బీఎస్ఈ)కి తెలియజేసింది. ఈ రాజీనామా లేఖను బీఎస్ఈ తన వెబ్‌సైట్‌లో ఉంచడంతో ఇది వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే రింకూ పటేల్ రాజనీమా లేఖ చేసిన రోజునే మిత్షీ ఇండియా షేర్ ధరలు ఊహించని విధంగా పెరిగాయి. డిసెంబర్ 22న జరిగిన ట్రెడింగ్ సెషన్‌లో, కంపెనీ ఒక్కో షేర్ విలువ రూ. 23.30 వద్ద స్థిరపడింది. అంతకుముందు రోజు ముగింపు ధర రూ. 22.33తో పోలిస్తే గణనీయంగా 4.34 శాతం పెరిగింది.