Microsoft LayOff: మైక్రోసాఫ్ట్‌లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- మైక్రోసాఫ్ట్‌లో 4,800 మంది ఉద్యోగులకు లేఆఫ్స్.
- AI పై భారీ పెట్టుబడుల నేపథ్యంలో నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft LayOff: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత తీవ్రంగా ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్స్‌కి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4800 మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఇది మొత్తం కంపెనీ వర్క్ ఫోర్స్‌లో 2.1 శాతం. ఏఐ మౌలిక సదుపాయాలపై బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్ నేపథ్యంలో, ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది.
ఈ ఏడాది ఏఐ రంగంలో అన్ని టెక్ కంపెనీలు కలిపి ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు అంచనా. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు అమెజాన్, మెటా, గూగుల్ వంటి సంస్థలు కూడా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫలితంగా తమ ఉద్యోగులకు తొలగిస్తున్నాయి. 2026 మొదటి ఆరు నెలల్లో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 23 శాతం పడిపోయిన నేపథ్యంలో, సోమవారం నాడు ఈ కోతలను ప్రకటించింది. 2022 తర్వాత ఇదే అత్యంత దారుణమైన ఫస్ట్ హాఫ్ పనితీరు. మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తన యూఎస్ ఉద్యోగులకు సుమారు 7 శాతం మందికి, అంటే దాదాపుగా 9000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఉద్యోగాల కోతను ప్రకటించింది.
Also Read
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!