మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను ప్రవేశ పెడుతుంది.. అందులో కొన్ని స్కిమ్ లు అధిక రాబడితో పాటు రిస్క్ తక్కువగా ఉండేలా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో మహిళా సమ్మాన్ పొదుపు పథకం ఒకటి..ఈ పథకం మహిళలకు మాత్రమే. ఒకేసారి చెల్లింపు తర్వాత.. హామీ మొత్తం లబ్ధిదారుని ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం కేవలం మహిళల కోసం మాత్రమే ప్రారంభించింది. ఇది మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత హామీ ఆదాయాన్ని అందిస్తుంది. మహిళల పొదుపుపై వచ్చిన వడ్డీని ఎలా లెక్కించాలి. మహిళా సేవింగ్స్ స్కీమ్‌పై పొందిన వడ్డీ మెచ్యూరిటీపై చెల్లించబడుతుంది.
అయితే వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన సమ్మేళనం చేయబడుతుంది. ఈ పథకంలో పెట్టుబడిపై మొత్తం సాధారణ వడ్డీ రేటుపై లెక్కించవచ్చు…ప్రభుత్వం అందిస్తున్న మిగిలిన పథకాలు లాగానే ఇది కూడా వడ్డీని లెక్కిస్తారు.. ఈ అకౌంట్ గురించి పూర్తి వివరాలు.. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ యోజనను తల్లిదండ్రులు ఎవరైనా స్త్రీ లేదా ఆడపిల్లల కోసం తీసుకోవచ్చు. ఈ పథకం కింద 31 మార్చి 2023 నుంచి రెండు సంవత్సరాల పాటు ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో, పెట్టుబడిదారులు ఒకే రకమైన ఖాతాను తెరవగలరు… ఈ ఖాతాను పోస్టాఫీసు లేదా బ్యాంకులలో కూడా ఓపెన్ చెయ్యొచ్చు..
ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, మొదటి త్రైమాసికం తర్వాత మీకు రూ.3,750 వడ్డీ లభిస్తుంది. రెండవ త్రైమాసికం ముగిసే సమయానికి ఈ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు రూ.3,820 వడ్డీ లభిస్తుంది…మెచ్యూర్ అయ్యాక మీరు మొత్తం రూ. 2,32,044 పొందుతారు…ప్రస్తుతం ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.5 శాతం ఉంది..16 మే 2023న నోటిఫికేషన్‌లో ఈ పథకం నుంచి వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు అందుబాటులో లేదని పేర్కొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పథకం ద్వారా వచ్చే వడ్డీ రూ. 40,000 దాటితే సెక్షన్ 194A కింద TDS వర్తిస్తుంది… అంటే మొత్తం వడ్డీని పొందవచ్చు.. అంటే ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..