Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar Net Worth: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 66 ఏళ్లు వయసులో ఆయన ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి సమీపంలో కూలిపోయింది. ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన అజిత్ పవార్, మహారాష్ట్రలోని అత్యంత ధనిక రాజకీయ నాయకులలో ఒకరిగా ఉన్నారు. ఆయన నికర విలువ (అజిత్ పవార్ నెట్‌వర్త్) పలు నివేదికల ప్రకారం.. రూ.124 కోట్ల (సుమారు $1.24 బిలియన్).
READ ALSO: AP Cabinet Key Decisions: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్..
Also Read
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
మహారాష్ట్రలో అత్యంత ధనవంతులైన నాయకులలో ఒకరు..
ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానంలో బుధవారం ఉదయం మహారాష్ట్రలోని బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్ అత్యధిక సార్లు పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. 2024 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల సంఘం ముందు అఫిడవిట్‌లో తన ఆస్తులను వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. అజిత్ పవార్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ.124 కోట్లు అని సమాచారం.
ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పంచుకున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆయన కుటుంబం వద్ద మొత్తం రూ.14.12 లక్షల నగదు ఉండగా, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. 6.81 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అజిత్ పవార్ బ్యాంకు డిపాజిట్లు మాత్రమే దాదాపు రూ.3 కోట్లు, ఆయన భార్య సునేత్రా పవార్ ఖాతాల్లో కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. దీనితో పాటు ఆయన NSS, పోస్టల్ సేవింగ్స్ ఖాతాలలో రూ.1.52 కోట్లు జమ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద LIC లేదా ఇతర బీమా పాలసీ ఏమి లేదు. అజిత్ పవార్ షేర్లు, బాండ్లు, డిబెంచర్లలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఆయన షేర్ మార్కెట్‌లో రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆయన భార్య, పిల్లలు కూడా దాదాపు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టారు. దీనితో పాటు అజిత్ పవార్ రూ.38 లక్షల విలువైన బంగారు-వెండి ఆభరణాలను కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించగా, ఆయన భార్య వద్ద రూ.1.19 కోట్లకు పైగా విలువైన బంగారు-వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు ఆయన వద్ద దాదాపు రూ.80 లక్షల విలువైన వాహనాలు కూడా ఉన్నాయి.
కోట్ల విలువైన స్థిరాస్తి..
అజిత్ పవార్ స్థిరాస్తుల విషయానికొస్తే.. ఆయన తన కుటుంబానికి కోట్ల విలువైన ఆస్తిని వదిలి వెళ్ళారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన, ఆయన భార్య సుమారు రూ.13.21 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారు. ఆయనకు రూ.37 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది. అలాగే ఆయనకు రూ.11 కోట్లకు పైగా విలువైన వాణిజ్య భవనంతో సహా వాణిజ్య ఆస్తి కూడా ఉంది. వీటితో పాటు ఆయన పేరు మీద ఉన్న ఇళ్ల విలువ ఒక్కటి రూ.3 కోట్లు, ఇంకొక్కటి రూ.2 కోట్లు, మరొకటి దాదాపు రూ.90 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆయన భార్య సునేత్రా పవార్ కూడా రూ.22 కోట్లకు పైగా విలువైన నాలుగు ఇళ్లు, ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు.
READ ALSO: Stock Market: దళాల్ స్ట్రీట్‌లో బుల్ గర్జన.. స్టాక్ మార్కెట్‌లో లాభాల జాతర!
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!