Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pine Labs: స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏ షేరు అనూహ్య మలుపు తిరుగుతుందో అంచనా వేయడం కష్టం. నెల క్రితం వరకు ఒడిదొడుకులు ఎదుర్కొన్న ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ‘పైన్ ల్యాబ్స్’ (Pine Labs) షేరు ఇప్పుడు దలాల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గడిచిన నెల రోజుల్లోనే ఏకంగా 25 శాతానికి పైగా లాభాలను పంచిపెట్టి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచిన ఈ స్టాక్, రాబోయే రోజుల్లో మరో 30 శాతం వరకు ర్యాలీ చేసే అవకాశం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థలు స్పష్టం చేస్తుండటం ఇప్పుడు మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మోతీలాల్ ఓస్వాల్ బిగ్ టార్గెట్.. “బై” కాల్
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ ఫిన్‌టెక్ కౌంటర్‌పై అత్యంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. పైన్ ల్యాబ్స్ షేరును కొనుగోలు చేయవచ్చని (“Buy” రేటింగ్) సూచిస్తూ.. ఒక్కో షేరుకు ఏకంగా రూ.250 టార్గెట్ ప్రైజ్‌ను నిర్దేశించింది. కంపెనీ తన వ్యాపార నమూనాను లాభాల బాట పట్టించడంలో వేగంగా పురోగతి సాధిస్తోందని, ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు సులభంగా మరో 30% వరకు రాబడి లభించే స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ విశ్లేషించింది. ఈ స్టాక్ ఇంత వేగంగా పుంజుకోవడానికి కంపెనీ ఆర్థిక మూలాలు మెరుగుపడటమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
Also Read
- Gold - Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
* FY26 నుంచి FY28 మధ్య కాలంలో కంపెనీ రెవెన్యూ ఏటా 24 శాతం (CAGR) చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా.
* సర్దుబాటు చేసిన నికర లాభం (Adjusted PAT) ఏకంగా 129 శాతం భారీ జంప్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
* గతంలో కేవలం 9 శాతంగా ఉన్న ఎబిట్డా (EBITDA) మార్జిన్లు రాబోయే కాలంలో ఏకంగా 28.7 శాతానికి చేరే అవకాశముంది.
* వీటికి తోడు పీ2ఎం (P2M) లావాదేవీలపై వసూలు చేసే 0.4% ఎండీఆర్ (MDR) దీర్ఘకాలంలో కంపెనీ ఖజానాకు భారీ ఎత్తున లాభాలను చేకూర్చనుందని అంటున్నారు.
డిజిటల్ సామ్రాజ్యంలో తిరుగులేని పట్టు..
దేశవ్యాప్తంగా వ్యాపార వాణిజ్య వర్గాలకు డిజిటల్ చెల్లింపుల సేవలు అందించడంలో పైన్ ల్యాబ్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ పరిధిలోని మర్చంట్ల సంఖ్య 10 లక్షల మైలురాయిని దాటేసింది. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 740 కోట్ల లావాదేవీల ద్వారా దాదాపు రూ.17.2 లక్షల కోట్ల స్థూల లావాదేవీ విలువను (GTV) నమోదు చేసి తన సత్తా చాటింది. ముఖ్యంగా కంపెనీ అందిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాల విభాగమే (DITP) మొత్తం ఆదాయంలో సింహభాగం (68%) అందిస్తూ కంపెనీ బలమైన పునాదికి నిదర్శనంగా నిలుస్తోంది.
నష్టాల నుంచి బలమైన రికవరీ..
2025 నవంబర్‌లో రూ.221 ఐపీఓ ధరతో మార్కెట్లోకి అడుగుపెట్టిన పైన్ ల్యాబ్స్, రూ.242 వద్ద లిస్టింగ్ అయి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించింది. అయితే ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటూ సుమారు 16 శాతం మేర పతనమైంది. ఆ నష్టాల ఊబి నుంచి బయటపడుతూ గడిచిన వారం రోజుల్లో 6%, నెల రోజుల్లో 25.7% దూకుడు ప్రదర్శించి సరికొత్తగా పైపైకి దూసుకెళ్తోంది. కంపెనీ ఫండమెంటల్స్ బలపడుతుండటంతో పెద్ద ఇన్వెస్టర్లు మళ్లీ ఈ కౌంటర్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న కాలంలో రూ.250 స్థాయిని అందుకుంటే మార్కెట్లో మరోసారి పైన్ ల్యాబ్స్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..