PAC-SEBI: రేపు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి
- గురువారం పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి
- కాంగ్రెస్ ఎంపీ కేసీ. వేణుగోపాల్ ఆధ్వర్యంలో విచారణ
- రాజకీయ కుట్రగా అభివర్ణించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెబీ చైర్పర్సన్ మాధబి పూరీ బుచ్ గురువారం పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తమ ఎదుట హాజరుకావాలని పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సెబీ పని తీరుపై సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ ఎంపీ కేసీ. వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె హాజరుకానున్నారు. అయితే ఈ చర్యలను బీజేపీ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యుడు ఆరోపణలు చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: APPSC: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధ నియామకం
Also Read
- Credit Card Rules: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. మినిమమ్ డ్యూ చెల్లిస్తే భారీ నష్టం.. కొత్త రూల్స్ తెలుసుకోండి
- Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
- SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
- Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
ఇదిలా ఉంటే కేంద్రం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. సెబీ చీఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆమె నుంచి ఎలాంటి రాజీనామాలు ఆశించడం లేదని ఉన్నత వర్గాల పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. సెబీ చీఫ్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ మాధబిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన దర్యాప్తు ముగిసింది. అయితే మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు వర్గాలు చెప్పినట్లు సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్తో ప్రాణాపాయ స్థితి..
అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్‌బర్గ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. సెబీ ఛైర్పర్సన్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం అందుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేగాక తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలున్నాయని ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను మాధబి కొట్టిపారేశారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇలా చేశారని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: R.S PraveenKumar: “పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి”
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్‌పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!