Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్/ట్రైలర్ లాంచ్ వేడుకలో సమంత చాలా ఓపెన్‌గా, ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే ఒక ఏడాదిలో కనీసం రెండు సినిమాలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ ఈ ఒక్క సినిమాను మాత్రం ప్రాణం పెట్టి చాలా బాగా చేశాం. అది నా ప్రామిస్. జూన్ 19న మీరే థియేటర్లలో చూస్తారుగా.. ఈ సినిమాతో మనం ఒక్కొక్కరిని కొడతాం చూడు.. ఆ రేంజ్లో ఉంటుంది” అంటూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని గట్టిగా వ్యక్తపరిచారు. నిర్మాతగా తన అనుభవాన్ని పంచుకుంటూ.. “లాస్ట్ ఫైవ్ డేస్ ప్రొడ్యూసర్కుఎంత స్ట్రెస్ ఉందో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పటిదాకా ఒక యాక్టర్ గా చాలా హాయిగా నా లైఫ్ లివ్ చేశాను. సాధారణంగా సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా యాక్టర్స్, డైరెక్టర్లకే దొరుకుతుంది. కానీ రాత్రింబవళ్లు కష్టపడి సినిమాను సక్సెస్ చేసే నిజమైన వ్యక్తులకు థాంక్స్ చెప్పడానికి నేను ఈ స్టేజ్ వాడుకోవాలనుకుంటున్నాను” అని అన్నారు.
“లాస్ట్ వన్ వీక్‌గా మా అసిస్టెంట్ డైరెక్టర్లు మహేష్, శీను, అన్వేష్, వంశీ, కుశాల్.. అస్సలు నిద్రపోలేదు, కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. శీను అయితే ఇప్పుడు కూడా మిక్సింగ్లోనే ఉన్నారు. వసంత్, ప్రహాస్ రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఈ సినిమాలో నేను నాచురల్ గా పర్ఫార్మ్ చేశానంటే.. అందులో సగం క్రెడిట్ ఈ డైలాగ్స్‌దే. విఎఫ్ఎక్స్ నిఖిల్, ఎడిటర్ ధర్మేంద్ర గారు, సౌండ్ మిక్సింగ్ అజిత్ గారు డే అండ్ నైట్ పనిచేశారు. పల్లవి డిజైన్ చేసిన శారీ కట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా కష్టమైంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ లీ విటకర్ ఈ సినిమాలో ఎక్స్ట్రార్డినరీ యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. టీజర్లో చూసింది శాంపిల్ మాత్రమే.. అసలు యాక్షన్ సినిమాలో చూస్తారు. ఈ సినిమాలో తాను యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా డ్యూయల్ రోల్ పోషించినా హిమాంక్, నందినీ రెడ్డి ప్రతీ విషయంలోనూ తనకు సపోర్ట్ సిస్టమ్‌లా నిలిచారని సమంత కొనియాడారు. అలాగే రాజ్ అండ్ డీకే గురించి మాట్లాడుతూ.. “వాళ్ల లైఫ్‌లో లక్ అనేది లేదు, కేవలం హార్డ్ వర్క్ మాత్రమే నమ్ముకుంటారు. రూమ్‌లో అందరికంటే ఎక్కువగా ఎలా కష్టపడాలి అనేది వాళ్లను చూసే నేర్చుకున్నాను. అలాగే ఎప్పుడు పిలిచినా సాయం చేసే సీత గారికి థాంక్స్” అని పేర్కొన్నారు. చివరి నిమిషంలో సపోర్ట్ అందించి ఫైనల్ కాపీ ఈరోజే రెడీ అవ్వడానికి కారణమైన మ్యూజిక్ డైరెక్టర్లు మిక్కీ జే మేయర్, సురేష్ బొబ్బిలి, మహేష్ శంకర్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “మూడేళ్లు గ్యాప్ వచ్చినా నాపై అదే ప్రేమ, సపోర్ట్ చూపిస్తున్నందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతురాలిని. జూన్ 19 తర్వాత మీ రివ్యూస్ కోసం ఎదురుచూస్తుంటాను” అని తన అభిమానులకు పిలుపునిచ్చారు.
Also Read
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!