భారత దేశంలోనే అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీ పాలసీలకు జనాల్లో రోజూ రోజుకు క్రేజ్ పెరుగుతుంది.. ఎక్కువ మంది పాలసీలను తీసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.. దాంతో కస్టమర్స్ కోసం అనేక పథకాలను అందిస్తున్నారు.. అందులో కొన్ని పథకాలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయి.. వాటిలో ఒకటి ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్.. దీన్ని లాంచ్ చేసిన ఈ ప్లాన్ నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ ప్లాన్ జాయిన్ కావాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ కింద మెచ్యూరిటీ తర్వాత స్థిర చెల్లింపు అందిస్తారు. అలాగే పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబానికి పాలసీ మొత్తాన్ని అందిస్తారు. అయితే ఆధార్ కార్డును కలిగి ఉన్న మహిళలు మాత్రమే ఈ పాలసీని పొందేందుకు అర్హులు. ఈ పథకంలో చేరే మహిళలు 55 ఏళ్ల లోపు ఉండాలి. మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలుగా ఉంటుంది… మెచ్యూర్ టైం కు రూ.. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఉంటుంది.
ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీ ద్వారా మెచ్యూరిటీ తర్వాత రూ. 11 లక్షలు సేకరించేందుకు రోజుకు రూ.87 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే వార్షికంగా రూ. 31,755 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది..పాలసీదారు మరణించిన సందర్భంలో హామీ మొత్తం నామినీకి అందిస్తారు. ఈ మొత్తం వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు లేదా హామీ మొత్తంలో 110 శాతం వరకు ఉంటుంది. ఈ ఎల్‌ఐసీ ప్రోగ్రామ్ మహిళలకు జీవిత బీమా ప్రయోజనాల ప్రయోజనాన్ని పొందుతూ వారి ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్.. అలాగే మహిళలకు ప్రత్యేమైన లోన్స్ ను కూడా ఇస్తుంది.. ఇంకా పన్ను మినహాయింపు కూడా ఉంటుందని మర్చిపోకండి..