LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
- ఎల్ఐసీ షేర్లలో భారీ పతనం
- రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్
- పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ (LIC) షేర్లు ఒక్కసారిగా దాదాపు 50 శాతం పడిపోయి రూ.823 నుంచి రూ.414 స్థాయికి చేరాయి. అయితే, ఈ పతనం వల్ల పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం 1:1 బోనస్ షేర్ల జారీ. ఎల్ఐసీ తమ వాటాదారులకు తొలిసారిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది.
అంటే, ఒక షేర్ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి అదనంగా మరో షేర్ ఉచితంగా లభిస్తుంది. మే 29న LIC షేర్లు ఎక్స్-బోనస్‌గా ట్రేడ్ కావడం వల్లే షేర్ ధర సర్దుబాటు చెంది సగానికి పడిపోయినట్లు కనిపిస్తోంది. అందువల్ల, షేర్ ధరలో కనిపిస్తున్న ఈ తగ్గుదల కంపెనీ విలువ తగ్గిందని కాదు. ఇది కేవలం బోనస్ షేర్ల సర్దుబాటు కారణంగా జరిగిన సాంకేతిక మార్పు మాత్రమే.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
బోనస్ ఇష్యూ కోసం మే 29 రికార్డ్ డేట్
ఎల్ఐసీ ఈ బోనస్ షేర్ల జారీని ఏప్రిల్‌లో ప్రకటించింది. కంపెనీ బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. బోనస్ షేర్లకు అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు మే 29ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. అంటే, మే 29 నాటికి LIC షేర్లు కలిగి ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి ఒక్కో షేర్‌కు మరో బోనస్ షేర్ లభిస్తుంది.
ప్రభుత్వ వాటాల విక్రయ వార్తల ప్రభావం
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం LICలో తన వాటాలో మరో 2 శాతం విక్రయించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలు కూడా షేర్‌పై ఒత్తిడిని పెంచాయి. ఈ వార్తల నేపథ్యంలో LIC షేర్లు దాదాపు 3 శాతం పడిపోయి రూ.830 వద్ద ముగిశాయి.
LIC ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయన్న నిపుణులు
మార్కెట్ నిపుణుడు, యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా మాట్లాడుతూ, LIC సంస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ (డిస్ఇన్వెస్ట్మెంట్) వార్తలు సమీప భవిష్యత్తులో స్టాక్‌పై కొంత ఒత్తిడిని తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!