భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన భీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది..కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవచ్చు. ఎంచుకునే ఎల్ఐసీ పాలసీ ఆధారంగా వచ్చే బెనిఫిట్స్ కూడా మారాతయాని గుర్తించుకోవాలి.. అందుకే పాలసీ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పాలసీ తీసుకున్నా కూడా దాని ప్రయోజనాలు పూర్తిగా పొందలేరు. ఎల్ఐసీ అందించే పాలసీల్లో జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఈ పాలసీ వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం లభిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే.. నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ ఉంటుంది. అందుకే మీరు ఈ పాలసీ కొనుగోల చేయడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చని చెప్పుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న తర్వాత రెండు రకాల ప్రయోజనాలను పొందవచ్చు..పాలసీ టర్మ్‌లో మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. అలాగే పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే.. అప్పుడు వారికి ఒకేసారి భారీ మొత్తం వస్తుంది. ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్, లోన్ ఫెసిలిటీ వంటి ప్రయోజనాలు పొందొచ్చు..
ఇక ఉదాహరణకు మీరు . 20 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే.. మీ వయసు 30 ఏళ్లు అనుకుంటే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 54 లక్షలు లభిస్తాయి. నెలవారీ ప్రీమియం రూ. 7572గా ఉంటుంది. అంటే మీరు రోజుకు దాదాపు రూ. 250 పొదపు చేస్తే సరిపోతుంది. మీరు ఎంచుకునే బీమా మొత్తం ఆధారంగా మీ ప్రీమియం కూడా మారుతుంది.. ఈ పాలసీని 8 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు కొనుగోలు చెయ్యొచ్చు..పాలసీ టర్మ్ 16 ఏళ్లు, 21 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉంటుంది. 16 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 21 ఏళ్ల ప్లాన్ అయితే 15 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 25 ఏళ్ల ఎల్ఐసీ ప్లాన్ అయితే 16 ఏళ్లు ప్రీమియం కట్టాలి.. లోన్ ఫెసిలిటి కూడా ఉంది..