Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా జియో ప్లాట్‌ఫామ్స్ దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.37,700 కోట్ల భారీ నిధుల సమీకరణే లక్ష్యంగా రాబోతున్న ఈ మెగా ఇష్యూ కోసం మదుపరులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మార్కెట్లను ఊపేస్తున్న ఈ భారీ ఐపీవో వేళ ఒక బయటపడ్డ షాకింగ్ నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశమంతా జియో అంటే కేవలం ముకేశ్ అంబానీ సొంత సామ్రాజ్యం అనుకుంటోంది. కానీ మార్కెట్ రెగ్యులేటర్‌కు సమర్పించిన ముసాయిదా పత్రాలు (DRHP) మాత్రం పూర్తి భిన్నమైన నిజాన్ని బయటపెట్టాయి.
అంబానీ వాటా 100% కాదు.. కేవలం
జియో ప్లాట్‌ఫామ్స్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పూర్తి యాజమాన్య హక్కులు లేవన్నదే ఇప్పుడు ట్రేడింగ్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ నివేదికల ప్రకారం.. జియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా కేవలం 66.43 శాతం మాత్రమే. మిగిలిన 33 శాతానికి పైగా భారీ వాటాను ప్రపంచ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ సావరిన్ వెల్త్ ఫండ్లు చేజిక్కించుకున్నాయి. మొత్తం 105 మంది వాటాదారుల పెట్టుబడులతో జియో నడుస్తోంది. ముకేశ్ అంబానీ కేవలం టెలికాం ఆపరేటర్‌గా కాకుండా, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ పవర్‌హౌస్‌గా జియోను తీర్చిదిద్దడం వల్లే ప్రపంచ స్థాయి కార్పొరేట్ శక్తులు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. రిలయన్స్ తర్వాత జియోలో రెండో అతిపెద్ద వాటాదారుగా సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) అనుబంధ సంస్థ ‘జాదూ హోల్డింగ్స్ ఎల్ఎల్సీ’ నిలిచింది. దీనికి ఏకంగా 9.98 శాతం వాటా ఉంది. మరో టెక్ దిగ్గజం గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సీ 7.73 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. వీటితో పాటు సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) 2.31 శాతం, కేకేఆర్ అనుబంధ సంస్థ ఒమిక్రాన్ ఏషియా హోల్డింగ్స్ 2.31 శాతం, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ 2.31 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సిల్వర్ లేక్, ముబాదలా, జనరల్ అట్లాంటిక్ వంటి మరిన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సైతం జియోలో కీలక భాగస్వాములుగా ఉండటం అంతర్జాతీయ స్థాయిలో జియో బలాన్ని చాటుతోంది.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ఈ మెగా ఇష్యూలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఇందులో ఎలాంటి ‘ఆఫర్ ఫర్ సేల్’ భాగం లేదు. సాధారణంగా ఐపీవో వచ్చిందంటే పాత ఇన్వెస్టర్లు తమ వాటాలను అమ్ముకుని లాభాలతో బయటపడటం ఆనవాయితీ. కానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న ఏ ఒక్క పాత ఇన్వెస్టర్ కూడా తమ వాటాలను విక్రయించడం లేదు. కంపెనీ భవిష్యత్తు, డిజిటల్ విస్తరణపై గ్లోబల్ దిగ్గజాలకు ఉన్న తిరుగులేని నమ్మకానికి ఇది నిదర్శనం. కంపెనీ మార్కెట్ నుంచి సమీకరించే రూ.37,700 కోట్ల మొత్తాన్ని 27 కోట్ల సరికొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారానే సేకరించనుంది. ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ దాదాపు రూ.1,065 నుంచి రూ.1,119 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. సెబీ వద్ద తుది పత్రాల దాఖలు అనంతరం, అక్టోబర్ మూడో వారం నాటికి సబ్స్క్రిప్షన్ తేదీలు అధికారికంగా ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంబానీ టెక్నాలజీ విజన్, గ్లోబల్ ఇన్వెస్టర్ల అండతో వస్తున్న ఈ భారత మార్కెట్ హిస్టారికల్ ఐపీవో ఇంకెన్ని సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?